ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్న రావణ్ అరెస్ట్ అంశం ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. రాజకీయ నేతల నుంచి సోషల్ మీడియా వరకు ఇదే చర్చ నడుస్తోంది. రావణ్ అరెస్ట్ విషయంలో ఇప్పుడు అందరూ ఉపా చట్టం గురించే చర్చించుకుంటున్నారు. రావణ్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం సరికాదని కొందరు అంటుంటే.. తప్పు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం కూడా తప్పేనా అంటూ మరో మరికొందరు వాదిస్తున్నారు. తాజాగా ప్రశ్న రావణ్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడంపై టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ స్పందించారు. 'ప్రశ్న వివాదంలోని వ్యక్తులకు, వారి లీగల్ టీమ్‌లకు ప్రధానంగా ఆందోళన కలిగించే అఅంశం ఏమిటంటే ఉపా చట్టం. ఈ UAPA అనేది రాష్ట్ర చట్టం కాకుండా కేంద్ర చట్టం కాబట్టి.. దీని కింద తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు ఇతర ఏ రాష్ట్రంలోనైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని గమనించాలి. హిందూ వ్యతిరేక కార్యకలాపాలను దేశ వ్యతిరేక కార్యకలాపాలుగా పరిగణించి.. అటువంటి కేసులను తీవ్రంగా పరిగణించే ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రానికి చెందిన అధికారులు.. దీనిపై చర్యలు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది?.. ఆ ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇతర ఆరోపణలు పక్కన పెడితే.. సోషల్ మీడియాను విచక్షణతో ఉపయోగించాలి.. ఆవేశంతో వెంటనే స్పందించే నెటిజన్లకు ఇది ఒక స్పష్టమైన సంకేతం' అని నరేష్ ట్వీట్ చేశారు.ఏపీలో పరిణామాలపై నరేష్ వరుసగా స్పందిస్తున్నారు. జైభీమ్ పార్టీ అధినేత జడా శ్రవణ్ కుమార్, అతని టీమ్ తీవ్ర మత, రాజకీయ ప్రచారం, ఆ తర్వాత నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్టులు, అధికార కూటమిని సవాలు చేసే లక్ష్యంతో ఉన్నాయన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు క్రైస్తవ, దళిత ఓట్లను ఆకట్టుకునేందుకు మరో రాజకీయ పార్టీతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలను మార్చడానికి వారు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇది గుండెపోటుకు ఇది
Actor ProfileActor
ఇదో వార్నింగ్.. వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•13 Oct 2026
ఇదో వార్నింగ్.. వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలి, వణుకు మొదలైంది