ఇది భయ్యా.. అసలైన బంధం.!. విడాకుల కోసం వచ్చి మళ్లీ దండలు మార్చుకున్న జంట.. అసలు మ్యాటర్ ఏమిటంటే
Actor ProfilePolitician

ఇది భయ్యా.. అసలైన బంధం.!. విడాకుల కోసం వచ్చి మళ్లీ దండలు మార్చుకున్న జంట.. అసలు మ్యాటర్ ఏమిటంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇది భయ్యా.. అసలైన బంధం.!. విడాకుల కోసం వచ్చి మళ్లీ దండలు మార్చుకున్న జంట.. అసలు మ్యాటర్ ఏమిటంటే
Zee Telugu31 Oct 2026
ఇది భయ్యా.. అసలైన బంధం.!. విడాకుల కోసం వచ్చి మళ్లీ దండలు మార్చుకున్న జంట.. అసలు మ్యాటర్ ఏమిటంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tirupati Putturu couple reunite again: సమాజంలో ఇటీవల చాలా మంది భార్యభర్తలు ప్రతిచిన్న విషయాలను పెద్దది చేసుకుంటున్నారు. భూతద్దంలో పెట్టి గొడవల్ని పెద్దది చేసుకుని విడాకుల వరకు వెళ్లిపోతున్నారు. మరికొన్ని జంటలు ఒకడుగు ముందుకేసి సుపారీలు ఇచ్చి మరీ కట్టుకున్న వాళ్లను కాటికి పంపుతున్నారు. ప్రతిరోజు భార్యభర్తల హత్యలు , దాడులకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కానీ తిరుపతి జిల్లాలో వీటికి భిన్నంగా జరిగిన ఘటన ప్రస్తుతం అందరి మనస్సుల్ని టచ్ చేసిందని చెప్పుకొవచ్చు. కోపాలు కొన్ని రోజుల వరకే ఉంటాయి. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్యలు అయిన ఈజీగా పరిష్కారమౌతాయని తిరుపతి జిల్లా పుత్తురుకు చెందిన జంట నిరూపించారు. తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం ముద్దు కృష్ణాపురానికి చెందిన గిరిబాబు, కాపు వీధికి చెందిన తేజస్వినికి పదేళ్ల కిందట పెళ్లయింది. కొన్ని ఏళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆతర్వాత ఇద్దరు కూతుళ్లు పుట్టారు. మరీ ఏమైందో కానీ క్రమంలో ఇద్దరిమధ్య మనస్తర్థలు వచ్చాయి. దీంతో 2025లో మరింత గొడవలు ముదిరాయి.ఈ క్రమంలో మ్యూచ్యువల్ డివోర్స్ తీసుకోవాలని ఇద్దరు డిసైడ్ అయ్యారు. వెంటనే ఇద్దరు న్యాయవాది మురుగేశ్ రెడ్డిని కలిశారు. ఇద్దరం విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాం, న్యాయస్థానం ద్వారా అధికారికంగా తమకు విడాకులు ఇప్పటించాలని కోరారు. అయితే, న్యాయవాది ఆ జంటను విడదీయకుండా కలిసి ఉండేందుకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పలుమార్లు వారికి సముదాయించి చెప్పారు. ఇటీవల పుత్తూరులో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌కు ఈ జంట గిరిబాబు, తేజస్వినిని వచ్చారు. అక్కడ లోక్ అదాలత్‌లో