
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Drunk man steals parked tgsrtc bus in Jangaon: ఇటీవల కొంత మంది మద్యం తాగి రోడ్ల మీద హల్ చల్ చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కల్గిస్తున్నారు. అంతే కాకుండా ఎవరైన వారిని ఆపేందుకు ప్రయత్నిస్తే వారి మీద కూడా దాడులకు వెనుకాడటంలేదు. తప్పతాగి రాత్రి పూట అరుస్తు, దాడులు చేస్తు, చోరీలకు కూడా పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో మద్యం మత్తులో కొంత మంది అసలు ఏంచేస్తారో వారికే తెలిదు. తాజాగా.. ఒక మందుబాబు మత్తులో ఏకంగా బస్సును తీసుకుని పారిపోయాడు. జనగామలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. జనగామలో జిల్లాలో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బస్టాండ్‌లో ఒక ఆర్టీసీ అద్దె బస్సు ఆగి ఉంది. ఇంతలో పాలకుర్తికి చెందిన వెంకన్న అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే అతను ఫుల్ గా తాగి ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్న అతను.. బస్సు స్టార్ట్ చేసి, సూర్యపేట వైపు 21 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆ తర్వాత బస్సు ఒక్కసారిగా సింగరాజుపల్లి టోల్‌గేట్ వద్ద అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టి వాహనం ఆగిపోయింది. దీంతో అక్కడి వారు అతడ్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. పైగా తప్పతాగి ఉన్నాడు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు. Read more: సిరిసిల్ల జిల్లాలో వింత ఘటన.. ప్రియురాలి పెళ్లి ఆపడానికి ఊరంతా పోస్టర్లు వేసిన యువకుడు! టోల్ గెట్ సిబ్బంది నిర్వాహకుల సమాచారంతో..పోలీసులు రంగంలోకి అతడ్ని