ఇదెక్కడి విడ్డూరం.. చనిపోయినట్లు నటిస్తున్న కోబ్రా.. వీడియో వైరల్
Actor ProfilePolitician

ఇదెక్కడి విడ్డూరం.. చనిపోయినట్లు నటిస్తున్న కోబ్రా.. వీడియో వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇదెక్కడి విడ్డూరం.. చనిపోయినట్లు నటిస్తున్న కోబ్రా.. వీడియో వైరల్
Zee Telugu27 Oct 2026
ఇదెక్కడి విడ్డూరం.. చనిపోయినట్లు నటిస్తున్న కోబ్రా.. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Cobra Acting as death funny video: సాధారణంగా ప్రాణాల మీద ఆశలు ఉన్నవారికి పాముల్ని చూస్తే భయపడి దూరంగా పారిపోతారు. కానీ కొంత మంది పాములతో వీడియోలు, ఫోటోలు దిగుతుంటారు. రకరకాల స్టంట్ లకు దిగుతారు. అంతే కాకుండా పొరపాటున పాములు కాటు వేస్తే తిరిగి దాని మీద దాడికి సైతం దిగుతుంటారు. ఇటీవల కొంత మంది మరీ సైకోలుగా ప్రవర్తిస్తున్నారు. పాము కాటు వేస్తే రివర్స్ లో దాని మీద దాడికి దిగుతున్నారు. వాటిని కొరుకుతున్నారు. పాముపైన తమ పైశాచీకం చూపిస్తున్నారు. నార్మల్ గా పాములు జనాలు అలజడి వస్తే అక్కడ అస్సలు ఉండవు. ఎక్కువగా చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఉండేందుకు ఆసక్తిని చూపిస్తాయి. అందుకే ఇంట్లో సజ్జల మీద, కార్లలో, బైక్ ల మీద, పాములు ఉండటం తరచుగా చూస్తుంటాం. కొన్నిపాములు తమకు డెంజర్ గా సంకేతాలు వచ్చినప్పుడు లేదా తమ శత్రువుల దాడుల నుంచి తప్పించుకునేందుకు చనిపోయినట్లు కూడా నటిస్తాయి. ఈస్టర్న్ హాగ్నోస్ స్నేక్ లు ఈ రకమైన టెక్నిక్ లను ఫాలో అవుతాయి. పాములు తమకు ఏదైన జీవి హని కల్గిస్తుందంటే చాలు వెంటనే అవి చనిపోయినట్లు మెలికలు తిరిగిపోయి పడిపోతాయి. అంతే కాకుండా చాలా సేపు అక్కడ నుంచి జరగటానికి ఇష్టపడవు. అచ్చం ఈ కోవకు చెందిన ఒక పాము వీడియో వైరల్గా మారింది. దీనిలో ఒక పాము మెలికలు తిరిగిపోయి పడిపోయింది. అది ఏ మాత్రం కూడా కదలటానికి ఇష్టపడటంలేదు. అప్పుడు చనిపోయినట్లు ఆస్కార్ లెవల్ లో నటిస్తుంది. Read more: Video