ఇటు ప్రభాస్ హింస
Actor ProfileActor

ఇటు ప్రభాస్ హింస

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇటు ప్రభాస్ హింస, అటు గాంధీజీ అహింస.. ఫేస్ చూపించకుండానే అరాచకం సృష్టించారుగా
Samayam Telugu25 Dec 2026
ఇటు ప్రభాస్ హింస, అటు గాంధీజీ అహింస.. ఫేస్ చూపించకుండానే అరాచకం సృష్టించారుగా

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ‘ఫౌజీ’ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రభాస్ జంద్యం ధరించి, ఒంటి నిండా రక్తంతో చేతిలో పెద్ద తుపాకీ పట్టుకొని శవాల మధ్యలో కూర్చున్నట్లు చూపించారు. ఇప్పుడు తాజా పోస్టర్‌లో చార్మినార్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన మారణహోమంలో.. ప్రభాస్ దోతి ధరించి, రెండు చేతుల్లో రెండు పిస్టల్స్ పట్టుకొని, రక్తంలో తడిచిపోయి ఉన్నారు. అలానే బ్యాగ్రౌండ్ లో మహాత్మా గాంధీ నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు.Read Also: ‘ఫౌజీ’పై ప్రభాస్ స్పెషల్ ఫోకస్.. షూటింగ్ లేకపోయినా సెట్స్‌కు వెళ్లి కూర్చుంటున్న రెబల్ స్టార్ప్రభాస్ ఫేస్ రివీల్ చేయకుండానే, అతను సృష్టించిన విధ్వంసాన్ని ‘ఫౌజీ’ పోస్టర్‌లో ఆవిష్కరించారు. అందుకు పూర్తి భిన్నంగా అహింసా మార్గాన్ని ఎంచుకున్న గాంధీని చూపించారు. ఇందులో గాంధీజీ వెనక్కు వెళ్తుంటే.. ప్రభాస్ మాత్రం తుపాకులు పట్టుకుని ముందుకు వెళ్తున్నారు. దీన్ని బట్టి వీరిద్దరూ భిన్న ధ్రువాల్లో ముందుకు సాగుతున్నారని అర్థమవుతోంది.మొత్తం మీద ‘ఫౌజీ’ కొత్త పోస్టర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. సినిమా కథాంశంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందులో ''ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్'' అనే క్యాప్షన్ ను కూడా మనం గమనించవచ్చు. ప్రభాస్ ఫేస్ చూపించనందుకు డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయినప్పటికీ.. ఈ బ్లడ్ బాత్ పోస్టర్ అంచనాలను రెట్టింపు చేసేలా ఉండటంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు.‘ఫౌజీ’లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా ప్రభాస్ కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకూ వచ్చిన రెండు పోస్టర్లలో ప్రభాస్ సైనికుడి గెటప్ లో కనిపించలేదు కానీ, బ్లడ్ బాత్ చాలా ఎక్కువే