
రాత్రి 2 గంటలు… ఇంట్లో లైట్లు అన్నీ ఆఫ్. బయట వర్షం. టీవీలో ఓ పాడుబడ్డ అపార్ట్‌మెంట్ కనిపిస్తోంది. లోపల ఎవరో నడుస్తున్న శబ్దం. ఒక్కసారిగా స్క్రీన్‌పై ఒక మెసేజ్ మెరుస్తుంది… “టార్చ్ ఆన్ చేయి!” మీ చేతిలో ఉన్న ఫోన్‌లో టార్చ్ ఆన్ చేస్తారు. అదే క్షణంలో టీవీ స్క్రీన్‌లో కూడా వెలుగు పడుతుంది. ఆ చీకట్లో ఎవరో కదిలినట్టు అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఇది కేవలం ఒక కొత్త ఫీచర్ కాదు. “సినిమా ఎలా చూస్తామనే పద్ధతినే మార్చే ప్రయోగం మొదలైంది.” ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద యుద్ధం సినిమాల మధ్య కాదు… మన అటెన్షన్ కోసం. నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ‘అన్‌హింజ్డ్’ (Unhinged) అనే ఇంటరాక్టివ్ హారర్ అనుభవాన్ని తీసుకొచ్చింది. కథ ఒక తుఫాను రాత్రి, పాడుబడిన అపార్ట్‌మెంట్‌లో సాగుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది… టీవీలో కథ నడుస్తుంది. మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కంట్రోలర్‌గా మారుతుంది. మీరు ఫోన్‌తో టార్చ్ వేస్తే… టీవీలో వెలుగు పడుతుంది. మీరు ఏ దారి వెళ్లాలో, ఏ వస్తువును పరిశీలించాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో—అన్నీ మీ చేతిలోనే ఉంటాయి. అంటే…హీరో ఏమైపోతాడా అని చూస్తూ భయపడటం కాదు…ఆ హీరో స్థానంలో మీరే ఉంటారు.ఇన్నాళ్లూ మనం కేవలం సినిమాలు చూశాం, వెబ్ సిరీస్‌లను ఎంజాయ్ చేశాం. కానీ ఇకపై సినిమాను కేవలం చూడటం ముగిసిపోయింది. ఓటిటి చరిత్రలోనే మైండ్ బ్లోయింగ్ అనదగ్గ భారీ మార్పుతో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ (Netflix) మన ముందుకు వస్తోంది. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న అసలు పోటీ ఇదే! ఆ ఖాళీ సమయాన్ని, మీ అటెన్షన్‌ను పూర్తిగా గెలుచుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ఒక కొత్త ఆయుధాన్ని బయటకు తీసింది. అదే జూన్ 30న రిలీజ్ కాబోతున్న ‘అన్‌హింజ్డ్’ (Unhinged) అనే ఒక సరికొత్త ఇంటరాక్టివ్ హారర్ ఎక్స్‌పీరియన్స్. టీవీలో కథ నడుస్తుంటే, మీ చేతిలోని ఫోన్నే కంట్రోలర్‌గా