
వసతిగృహాలు, గురుకులాల మరమ్మతులకు రూ.100 కోట్లు రెండో త్రైమాసికం నుంచి డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు సంక్షేమ శాఖలపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనాడు, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వసతిగృహాల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలని సూచించారు. బీసీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.500 కోట్ల మంజూరుకు పచ్చజెండా ఊపారు. రూ.100 కోట్లతో అన్ని గురుకులాలు, వసతిగృహాల్లో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో ఆయన బుధవారం అన్ని సంక్షేమశాఖల అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల విద్యార్థులకు 10% డైట్‌ఛార్జీల్ని పెంచాలని అధికారులను సీఎం ఆదేశించగా... ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థికశాఖ అధికారులు సూచించారు. కానీ ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే పెంపును వర్తింపజేయాలని సీఎం చెప్పారు. ‘బలహీనవర్గాల విద్యార్థుల కోసం డైట్ ఛార్జీలు పెంచాలి. చదువుతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవితాల్లో మార్పు వస్తుంది. మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు, పౌష్టికాహారాన్ని అందించాలి. అందుకే డైట్ ఛార్జీలను పెంచుతున్నాం’ అని స్పష్టం చేశారు. బీసీ రక్షణ చట్టం ముసాయిదాపై బీసీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని సీఎం సూచించారు. త్వరలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి: ‘వసతిగృహాలు, గురుకులాల విద్యార్థులను ఉన్నతవిద్య, పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలి. జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇప్పించాలి. ఎస్సీలకు 3, బీసీలకు 2, ఎస్టీలకు 1 ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటుచేయాలి. ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలను మ్యాపింగ్ చేసి, నైపుణ్యం పెంచి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వారిని సిద్ధం చేయాలి’ అని సీఎం సూచించారు. సంక్షేమ శాఖలపై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రులు ఫరూక్