ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఇకనైనా మానండి
Actor ProfilePolitician

ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఇకనైనా మానండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఇకనైనా మానండి
Sakshi27 Dec 2026
ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఇకనైనా మానండి

సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు ఎక్స్‌లో చేసిన పోస్టు విద్యుత్‌ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఒడిశా మీరు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవకముందే ఆ రాష్ట్రంలో సంస్కరణలు తెచ్చారు ఆ ఘనతను నాటి ఒడిశా సీఎం జేబీ పటా్నయక్‌ అంతకు ముందున్న సీఎంకే ఇచ్చారు ఆ ఘనత తనదని ఎప్పుడూ చెప్పుకోలేదు.. ఇదీ హుందాతనం సొంత డప్పు, అబద్ధాలు, ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకోవడం, తన తప్పులకు ఇతరులను నిందించడం నాయకత్వ లక్షణాలు కావు ‘ఎక్స్‌’లో చంద్రబాబును కడిగిపారేసిన సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్‌ సంస్కరణలను తానే తీసుకొచ్చానంటూ సీఎం చంద్రబాబు చెప్పడం పట్ల సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు తీవ్రంగా ఆక్షేపించారు. విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చింది మీరు కాదని, మీరు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవక ముందే ఒడిశాలో నాటి ముఖ్యమంత్రులు విద్యుత్‌ సంస్కరణలు తెచ్చారని, వీటిని విస్మరించి ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్తారంటూ సీఎం చంద్రబాబును ఆయన కడిగిపారేశారు. ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఇకనైనా మానండి అని సూచించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. దానికి విద్యుత్‌ సంస్కరణలను తానే తెచ్చానని సీఎం చంద్రబాబు ప్రసంగం వీడియోను జత చేశారు. వెన్నుపోటు పొడవక ముందే.. ‘‘ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఇకనైనా మానండి! దేశంలో విద్యుత్‌ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఒడిశా. 1992లోనే అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ విస్తృత సంప్రదింపులతో ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన జె.బి. పట్నాయక్‌ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లి ఒడిశా విద్యుత్‌ సంస్కరణల చట్టం – 1995’ను తీసుకొచ్చింది. ఒడిశా విద్యుత్‌ నియంత్రణ మండలి (ఓఈఆర్‌సీ) ఏర్పాటు, అప్పటి రాష్ట్ర విద్యుత్‌ సంస్థ (ఓఎస్‌ఈబీ)ను ఉష్ణ విద్యుత్‌ ఉత్పత్తి, జల విద్యుత్‌ ఉత్పత్తి, నాలుగు పంపిణీ సంస్థలుగా విభజన చేసి విద్యుత్‌