ఇండస్ట్రీలో కొత్త టర్న్ తీసుకుంటున్న తారక్
Actor ProfileActor

ఇండస్ట్రీలో కొత్త టర్న్ తీసుకుంటున్న తారక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇండస్ట్రీలో కొత్త టర్న్ తీసుకుంటున్న తారక్
123Telugu14 Jan 2027
ఇండస్ట్రీలో కొత్త టర్న్ తీసుకుంటున్న తారక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు వరకు హీరోగా ఒకటీ రెండు సినిమాల్లో గెస్ట్ రోల్స్, ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించడం జరిగింది. కానీ ఎన్నడూ లేని విధంగా ఇండస్ట్రీలో తారక్ సరికొత్త స్టెప్ తీసుకుంటున్నట్టుగా రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. ఇక నుంచి తారక్ ఒక్క హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారినట్టు తెలుస్తుంది. మన టాలీవుడ్ లో అనేకమంది హీరోలు నిర్మాణం లో కూడా ఉన్నారు. సో అలానే తారక్ ఓ ఇంట్రెస్టింగ్ బ్యానర్ టైటిల్ తో నిర్మాణం చేపట్టనున్నట్టు తెలుస్తుంది. తన పేరునే ఎంటర్టైన్మెంట్ (NTRTAIN) ఎంటర్టైన్ గా తన బ్యానర్ కి పెట్టినట్టు తెలుస్తుంది. సో దీనిపై మరిన్ని డీటెయిల్స్ అతి త్వరలోనే రానున్నాయి. ఇక నిర్మాతగా తారక్ నుంచి ఎలాంటి సినిమాలు అందిస్తారో చూడాలి