ఇండోనేషియా పర్యటనలో హిందీ పాట ప్రస్తావన.. మోదీకి ధన్యవాదాలు చెప్పిన కరణ్ జోహార్
Actor ProfilePolitician

ఇండోనేషియా పర్యటనలో హిందీ పాట ప్రస్తావన.. మోదీకి ధన్యవాదాలు చెప్పిన కరణ్ జోహార్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇండోనేషియా పర్యటనలో హిందీ పాట ప్రస్తావన.. మోదీకి ధన్యవాదాలు చెప్పిన కరణ్ జోహార్
Andhra Jyothy9 Oct 2026
ఇండోనేషియా పర్యటనలో హిందీ పాట ప్రస్తావన.. మోదీకి ధన్యవాదాలు చెప్పిన కరణ్ జోహార్

భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇండోనేషియాలోని జకార్తాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండోనేషియాలో ఓ భారతీయ సినిమాలోని పాటకు మంచి క్రేజ్ ఉందని అన్నారు. ఇంటర్‌నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇండోనేషియాలోని జకార్తాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండోనేషియాలో ఓ భారతీయ సినిమాలోని పాటకు మంచి క్రేజ్ ఉందని అన్నారు. ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాలోని ‘కుచ్ కుచ్ హోతా హై’ పాటను ప్రస్తావించారు. మోదీ మాట్లాడుతూ.. ‘ఇక్కడ భారతదేశానికి చెందిన 'కుచ్ కుచ్ హోతా హై' పాట చాలా ప్రాచుర్యం పొందింది. భారతదేశం, ఇండోనేషియా కలిసి ముందుకు సాగినప్పుడు.. ఆ ప్రయాణం కేవలం 'కుచ్ కుచ్' (కొంచెం కొంచెం) దగ్గరే ఆగిపోకుండా 'బహుత్ కుచ్' (చాలా ఎక్కువ) సాధించడానికి దారి తీస్తుంది’ అని అన్నారు. ఇండోనేషియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ‘కుచ్ కుచ్ హోతా హై’ పాటను ప్రస్తావించటంపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్ జోహార్ స్పందించారు. ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాకు దర్శకత్వం వహించింది ఆయనే. ప్రధాని తన సినిమాలోని పాటను ప్రస్తావించటంపై కరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘జకార్తాలో మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'కుచ్ కుచ్ హోతా హై' సినిమా గురించి మాట్లాడటం చాలా సంతోషాన్ని, గర్వాన్ని కలిగించింది. అన్నింటికీ అతీతమైన ఒక భాష నిజంగానే ఉంది.. అదే ప్రేమ. ఈ పాటను ఆదరించి.. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేలా చేసినందుకు మీకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. సూర్యాపేటలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జి రామమందిర దోపిడీకి ముందే.. 1983లో కాశీ ఆలయంలో ఏం జరిగిందంటే