
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అప్పటివరకూ డీఎంకేతో కలిసి కూటమిగా పోటీ చేసి ఐదు సీట్లు కూడా గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకేకు మద్దతివ్వాలని తీసుకున్న నిర్ణయం స్టాలిన్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో వ్యూహాత్మకంగా తన కూటమిలో మిగిలిన మిత్రపక్షాలైన వీసీకే, కమ్యూనిస్టులు, ఐయూఎంఎల్ ను విజయ్ గూటికి పంపి ప్రభుత్వం ఏర్పాటు చేయించిన స్టాలిన్ (MK Stalin) కు ఇప్పుడు వారి నుంచే ఒత్తిడి పెరుగుతోంది. విజయ్ తో కలిసి పనిచేయాలని డీఎంకే అధినేతకు సదరు మిత్రపక్షాలు సూచిస్తున్నాయి.M.K.Stalin: తమిళనాడు ఉపఎన్నికల్లో పోటీపై స్టాలిన్ కీలక నిర్ణయం..! జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేస్తున్న ఇండియా కూటమిలో ఇప్పటికీ భాగస్వామిగా ఉన్న డీఎంకేను విజయ్ టీవీకేతో కలిసి పనిచేయాలంటూ ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తిరుమావళవన్ పార్టీ వీసీకే తాజాగా స్టాలిన్ కు ఫోన్లు చేస్తోంది. బీజేపీని ఎదుర్కొనేందుకు ఇది అవసరమని తిరుమావళవన్ స్టాలిన్ కు గుర్తుచేస్తున్నారు. దీనిపై స్టాలిన్ ఇవాళ స్పందించారు. విజయ్ తో కలిసి పనిచేసేది లేదని ఆయన వీసీకేకు తేల్చిచెప్పేశారు. Vijay: సొంతంగా మెజార్టీ సాధించబోతున్న విజయ్..! త్వరలో ఆ కీలక పరిణామం..!కేరళ, పశ్చిమ బెంగాల్ తరహాలో తమిళనాడులోనూ విజయ్, స్టాలిన్ కలిసి ఉమ్మడిగా ఇండియా కూటమిలో పనిచేయాలని వీసీకే సూచిస్తోంది. వీసీకే ప్రతిపాదన ప్రకారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా కొనసాగుతాయి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతకు రాష్ట్ర స్థాయి రాజకీయ విభేదాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తూ.. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపింది. అయితే డీఎంకే ఈ సూచనను తోసిపుచ్చింది.