ఇంటర్వ్యూల్లోనే 90 శాతం అవినీతి
Actor ProfilePolitician

ఇంటర్వ్యూల్లోనే 90 శాతం అవినీతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంటర్వ్యూల్లోనే 90 శాతం అవినీతి
Eenadu23 Dec 2026
ఇంటర్వ్యూల్లోనే 90 శాతం అవినీతి

ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యార్థుల నిరసనలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Ramdev Baba) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న నిరసనలు, గందరగోళం విద్య, ఉపాధి వ్యవస్థల్లో ఉన్న తీవ్రమైన లోపాలను సూచిస్తున్నాయన్నారు. శనివారం పతంజలి యోగపీఠంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా రామ్‌దేవ్ మాట్లాడారు. ‘‘పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు వీధుల్లోకి వస్తున్నారు. పేపర్‌ లీక్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటర్వ్యూ సమయంలో 90 శాతం అవినీతి జరుగుతోంది. కులం, మతం, భావజాలం.. వంటి ఆధారంగా కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో.. అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారు. ప్రజాగ్రహం మరిన్ని నిరసనలకు దారితీయక ముందే.. వ్యవస్థలను సరిదిద్దుకోవాలి. అవినీతి, అవకతవకల ఆరోపణలను తేలిగ్గా విస్మరించలేం. ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలి. నిరసనల పేరిట అరాచకాన్ని, హింసను సమర్థించను’’ అని రామ్‌దేవ్ (Ramdev Baba) పేర్కొన్నారు. అలాగే రాజకీయ పార్టీలకు సూచనలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదాన్ని మరొకటి శత్రువులుగా భావించుకోకూడదన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షంతోపాటు భారత్‌లోని కులాలు వర్గాల మధ్య పరస్పరం గౌరవం ఉండాలని పిలుపునిచ్చారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో (NEET Row) దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు ఝార్ఖండ్‌లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్‌దేవ్ బాబా స్పందన వచ్చింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు