ఇంటింటికి తెదేపా’లో పాల్గొన్న ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు
Actor ProfilePolitician

ఇంటింటికి తెదేపా’లో పాల్గొన్న ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంటింటికి తెదేపా’లో పాల్గొన్న ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు
Eenadu11 Dec 2026
ఇంటింటికి తెదేపా’లో పాల్గొన్న ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు

అమృతలూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచారంలో భాగంగా వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు భట్టిప్రోలు మండలం వెల్లటూరు పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేస్తున్న తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం-2, ఎన్‌టీఆర్ భరోసా, సూపర్ సిక్స్ తదితర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. వెల్లటూరు గ్రామంలోని గౌడపాలెంలో అశ్వద్ నారాయణ - మహాలక్ష్మి కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వెల్లటూరులో సంక్షేమ పథకాల ద్వారా రూ.12 కోట్లకు పైగా ప్రయోజనాలు అందగా, రూ.5.71 కోట్ల విలువైన అభివృద్ధి పనులు, అనుమతులు, ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు