
ఇంటర్నెట్ డెస్క్: ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియలో భాగంగా ఇ-25 (E25 ethanol)పెట్రోల్‌ను కూడా తీసుకొస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. పలు వాహన మోడళ్లపై ఇ-25 పెట్రోల్ ఇంకా పరీక్షల దశలోనే ఉందని పేర్కొంది. ఆ నివేదికలు రాకముందే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని వెల్లడించింది. ఇ-25 పెట్రోల్ రోల్అవుట్ చేశారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్రం పేర్కొంది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి ఇలాంటివి వ్యాప్తి చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని కోరింది. నిబంధనలకు అనుగుణంగా అన్ని దశల పరీక్షల్లో సత్ఫలితాలు వచ్చాకనే ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియ తీసుకొచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. ఇ-20 పెట్రోల్ పూర్తిగా సురక్షితమైనదని మరోసారి స్పష్టం చేసింది. కాగా, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌తో ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల ద్విచక్ర వాహనాలు, 20 లక్షల ఫోర్ వీలర్ వాహనాలు నడుస్తున్నాయని, వాటిలో ఎలాంటి సమస్యలూ రాలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు