ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100 మిలియన్ వ్యూస్ రికార్డు.. యూత్ తెగ చూసేస్తున్నారు
Actor ProfileActor

ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100 మిలియన్ వ్యూస్ రికార్డు.. యూత్ తెగ చూసేస్తున్నారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100 మిలియన్ వ్యూస్ రికార్డు.. యూత్ తెగ చూసేస్తున్నారు
TV9 Telugu19 Nov 2026
ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100 మిలియన్ వ్యూస్ రికార్డు.. యూత్ తెగ చూసేస్తున్నారు

ఈ సినిమాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు. భారీ బడ్జెట్ మూవీ కాదు. ప్రస్తుతం హిట్ ఫార్మలా అయిన అబ్బురపరిచే వీఎఫ్‌ఎక్స్, యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఏమీ లేవు. అయితేనేం కంటెంట్ తో దుమ్ము రేపుతోందీ సినిమా. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. రికార్డు వ్యూయర్ షిప్ తో ఆహా ఓటీటీ ట్రెండింగ్ ఛార్ట్ లో అగ్రస్థానంలో దూసుకెళ్లుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటించిన ‘దీవాన’ సినిమా ఓటీటీలో సత్తా చాటుతోంది. ఇటీవల 'ఆహా'లో స్ట్రీమింగ్‌కి వచ్చిన ఈ సినిమా 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌కు చేరుకుంది. ‘దీవాన’ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ మీద వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. జూన్ 19న థియేటర్లలో రిలీజైన దీవానా సినిమాకు సూపర్ హిట్ టాక్ రాకపోయినా డీసెంట్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచిగానే వసూళ్లు రాబట్టింది. అప్పటికీ పోటీగా రిలీజైన సమంత మా ఇంటి బంగారం సినిమాతో సమానంగా దీవానా సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ ప్రేమకథా చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. బిగ్ స్క్రీన్ పై ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. జులై 31 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను అధిగమించింది. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కారంపూడి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు నరేష్, ఝాన్సీ, రఘు కారుమంచి, వేణు తదితరులు ప్రధాన