ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి
Actor ProfilePolitician

ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి
Eenadu2 Jan 2027
ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి

Stampede in temple|ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. లఖిసరాయ్‌ జిల్లాలోని అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. శ్రావణమాసం సోమవారం కావడంతో ఈ శివాలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే వారి మధ్యలో ఒక ఎలక్ట్రిక్‌ వైర్ తెగిపడిపోవడంతో ఒక్కసారిగా భయపడిపోయారు. షాక్‌ కొడుతుందనే ఆందోళనతో అక్కడినుంచి బయటకు పరిగెత్తే క్రమంలో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ‘‘భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. దానికి తగ్గట్టే మేం ఏర్పాట్లు చేశాం. భయాందోళన కారణంగా వారు పరిగెత్తడంతో బారికేడ్లు పడిపోయాయి. దాంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ఘటనకు ఎలక్ట్రిక్ వైర్ కారణంగా తెలుస్తోంది. ధ్రువీకరించుకున్న తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ అని లఖిసరాయ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌ శైలేంద్ర కుమార్ వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు