ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు.. టెన్త్ మార్కులతో భర్తీ.. ఇదే అసలు చిక్కు
Actor ProfilePolitician

ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు.. టెన్త్ మార్కులతో భర్తీ.. ఇదే అసలు చిక్కు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు.. టెన్త్ మార్కులతో భర్తీ.. ఇదే అసలు చిక్కు
Samayam Telugu15 Oct 2026
ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు.. టెన్త్ మార్కులతో భర్తీ.. ఇదే అసలు చిక్కు

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం త్వరలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే పదో తరగతిలో సాధించి మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కండక్టర్ ఉద్యోగానికి అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్, దరఖాస్తుకు చివరి తేదీ తదితర వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.పదో తరగతి పరీక్షల్లో కొంత కాలం మార్కులను ప్రకటించగా.. ఆ తర్వాత గ్రేడింగ్ విధానాన్ని అవలంభించారు. మళ్లీ మార్కుల విధానానికి మారారు. దీంతో గ్రేడింగ్ విధానంలో టెన్త్ పాసై ఆర్టీసీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి మార్కులు ఎలా కేటాయించాలనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.ఆర్టీసీలో ఏటా ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. కానీ కొత్తగా కండక్టర్ల నియామకాలను మాత్రం చేపట్టలేదు. దీంతో ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సిబ్బందిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండే హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర రీజియన్ల పరిధిలోని డిపోల్లో మాత్రం ఔట్‌సోర్సింగ్ ప్రతిపాదికన తాత్కాలిక ఉద్యోగులను నియమించారు.ఆర్టీసీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. మహాలక్ష్మీ పథకం కారణంగా బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరిగింది. ఓవైపు రిటైర్మెంట్ కారణంగా సిబ్బంది తగ్గుతుండటం, మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మరోవైపు ప్రయాణికులు పెరుగుతుండటంతో.. ఆర్టీసీలో పని చేస్తున్న సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. తాత్కాలిక సర్దుబాట్లు చేసినప్పటికీ.. పని భారం తగ్గలేదు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో డ్రైవర్లే టికెట్లు ఇచ్చే విధులు చేపట్టాల్సి వస్తోంది.2025 నవంబర్ నాటికే రాష్ట్రంలో 2059 మంది కండక్టర్ల కొరత ఉండగా.. 2026 మార్చి నాటికి మరో 140 మంది పదవీ విరమణ చేశారు. అదే సమయంలో కొత్త బస్సులు కూడా రోడెక్కాయి. వీటి కోసం