ఆర్టీజీ కేంద్రం నుంచి ఇక 24 గంటల సేవలు... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Actor ProfilePolitician

ఆర్టీజీ కేంద్రం నుంచి ఇక 24 గంటల సేవలు... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆర్టీజీ కేంద్రం నుంచి ఇక 24 గంటల సేవలు... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP7AM28 Sept 2026
ఆర్టీజీ కేంద్రం నుంచి ఇక 24 గంటల సేవలు... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలపై రియల్ టైమ్‌లోనే స్పందన ఉండాలని, ప్రభుత్వ సేవల్లో వేగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఐదు రోజుల జిల్లాల పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న ఆయన, సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్సు (ఆర్టీజీ) కేంద్రంలో ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పురపాలక, పంచాయితీరాజ్, హోం, ఎక్సైజ్ వంటి కీలక శాఖల పనితీరు, ప్రజా సేవల్లో నాణ్యతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వేగంగా స్పందించగలిగితేనే పౌరులకు మెరుగైన సేవలు అందించగలమని, పాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని ఆయన అన్నారు.రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం నుంచి ప్రజలకు వాస్తవ సమయంలోనే స్పందన అందాలని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ సముద్ర తీరంలో బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనను ఉదాహరణగా చూపుతూ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వివిధ ప్రభుత్వ విభాగాలు ఎంత తక్షణమే సమన్వయంతో స్పందించాయన్నదే కీలకమని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమన్వయం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆధ్వర్యంలో తరచూ మల్టీ డిపార్ట్‌మెంట్ కోఆర్డినేషన్ సమావేశాలు జరగాలని సూచించారు. ఆర్టీజీ కేంద్రం 24 గంటలూ ప్రజలకు సేవలందించేలా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు."ఏఐ మెథడాలజీ ద్వారా చిత్తూరు జిల్లాలో సంతృప్తి స్థాయి నమోదు చేస్తున్నాం. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలో 'లాస్ట్ మైల్ గవర్నెన్స్' ప్రజలకు అందాలి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాపాలనలో పొలిటికల్ మేనేజ్‌మెంట్, బ్యూరోక్రటిక్ యాక్షన్ సమపాళ్లలో ఉండాలి," అని ముఖ్యమంత్రి విశ్లేషించారు.పీజీఆర్ఎస్