
అనంతపురం టీడీపీ జిల్లా కార్యాలయానికి రెండెకరాలు ఎకరానికి ఏడాదికి రూ.వెయ్యి, 66 ఏళ్లకు లీజుకు ధారాదత్తం పెదవేగి ఫ్యాక్టరీ భూములపైనే టీడీపీ నేతల కన్ను సాక్షి, అమరావతి: రైతుల కోసం ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్‌ఫెడ్‌ను నిర్విర్యం చేసి, దాని విలువైన ఆస్తులను దశలవారీగా కబ్జా చేసేందుకు అధికార టీడీపీ నేతలుపావులు కదుపుతున్నారు. అనంతపురం నగర నడి»ొడ్డున రూ.50 కోట్ల విలువైన 2 ఎకరాల ఆయిల్‌ఫెడ్ భూమిని టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం లీజుకిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరొక వైపు లాభాల్లో నడుస్తోన్న ఏలూరు జిల్లా పెదవేగిలో ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ పేరిట నిర్విర్యం చేసి వందల కోట్ల విలువైన భూములను కాజేయాలనే కుట్ర జరుగుతోంది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైలా నిబంధనలకు పాతరేస్తూ నూనెగింజల రైతుల అభివృద్ధి, ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, రైతులకు మార్కెట్ మద్దతు కల్పన కోసం ఏర్పాటైన ఏపీ కో–ఆపరేటివ్ ఆయిల్‌సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ (ఆయిల్‌ఫెడ్)కు రాష్ట్రవ్యాప్తంగా రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అనంతపురంలో 21.84 ఎకరాలు, సర్వేపల్లిలో 50 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 18.5 ఎకరాలు, కాకినాడలో 3 ఎకరాలు సహా అనేక విలువైన భూములు సంస్థ సొంతం. వీటి మొత్తం విలువ రూ.2 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. వీటిలో అత్యంత విలువైనది అనంతపురంలోని ఎ.నారాయణపురంలో ఉన్న 21.84 ఎకరాల భూమి. ఇక్కడ ఎకరా మార్కెట్ విలువ రూ.25 కోట్లు పలుకుతోంది. అంటే మొత్తం భూమి విలువ దాదాపు రూ.550 కోట్ల పై మాటే. అలాంటి ఈ భూమిలో 2 ఎకరాలను ఏడాదికి కేవలం రూ.1000 చొప్పున లీజు ప్రాతిపదికన టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం ధారాదత్తం చేశారు.టీడీపీ కార్యాలయానికి భూమి ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆయిల్‌ఫెడ్ నిద్ద్వంద్వంగా తిరస్కరించింది. పైగా ఈ భూములు ప్రభుత్వం కేటాయించినవి కావు..సొంత నిధులతో ఏపీ ఆయిల్