ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత
Actor ProfileActor

ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత
Asianet News Telugu28 Sept 2026
ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ గౌరీ స్పాట్‌ను పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఈ రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. ఈ వేడుక చాలా సింపుల్‌గా, కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల మధ్య జరిగింది. వీరిద్దరి స్నేహం పెళ్లి బంధంగా మారడంతో ఈ జంట కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఈ పెళ్లి వేడుకను ఆడంబరంగా కాకుండా, చాలా ప్రైవేట్‌గా జరిపించారు. ఆమిర్ పిల్లలు ఇరా ఖాన్, జునైద్ ఖాన్ ఈ వేడుకకు హాజరై తండ్రి సంతోషంలో పాలుపంచుకున్నారు. సినీ పరిశ్రమ నుంచి కొద్దిమంది స్నేహితులు కూడా వచ్చారు. 'లగాన్' డైరెక్టర్ అశుతోష్ గోవారికర్, '3 ఇడియట్స్' డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ, నటి ఎల్లీ అవ్రామ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇది ఆమిర్ ఖాన్‌కు మూడో పెళ్లి. మొదట రీనా దత్తాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇరా, జునైద్ అనే ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత 'లగాన్' సినిమా టైంలో పరిచయమైన కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకున్నారు. 2011లో సరోగసీ ద్వారా వీరికి ఆజాద్ రావు ఖాన్ పుట్టాడు. 16 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2021లో ఆమిర్, కిరణ్ విడిపోయారు. విడిపోయినా కూడా స్నేహంగా ఉంటూ, కొడుకు ఆజాద్‌ను కలిసి పెంచుతున్నారు. ఇప్పుడు గౌరీ స్పాట్‌ను పెళ్లి చేసుకుని ఆమిర్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు