ఆపిల్ లవర్స్ కు షాక్.. మరింత లావుగా రాబోతున్న ఐఫోన్ 18 ప్రో
Actor ProfilePolitician

ఆపిల్ లవర్స్ కు షాక్.. మరింత లావుగా రాబోతున్న ఐఫోన్ 18 ప్రో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆపిల్ లవర్స్ కు షాక్.. మరింత లావుగా రాబోతున్న ఐఫోన్ 18 ప్రో
HMTV12 Oct 2026
ఆపిల్ లవర్స్ కు షాక్.. మరింత లావుగా రాబోతున్న ఐఫోన్ 18 ప్రో

iPhone 18 Pro : టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) తన ప్రతిష్టాత్మక నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ‘ఐఫోన్ 18’ (iPhone 18) లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఆపిల్ కంపెనీ సాధారణ టైమ్‌లైన్ ప్రకారం ఐఫోన్ 18 ప్రో , ప్రొ మ్యాక్స్ మోడళ్లు ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ ఫోన్ల అధికారిక ప్రకటన కంటే ముందే చైనా నుండి ఒక ఆసక్తికరమైన లీక్ బయటకు వచ్చింది. మునుపటి మోడళ్లతో పోలిస్తే రాబోయే 'ఐఫోన్ 18 ప్రో' (iPhone 18 Pro) మోడల్ మునిపటికంటే మందంతో (Thicker), ముఖ్యంగా కెమెరా మాడ్యూల్ భాగంలో చాలా లావుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ 'ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్' వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో మోడల్ తన ఐఫోన్ 17 ప్రో తరహాలోనే అల్యూమినియం అలాయ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, దీని అల్యూమినియం ఫ్రేమ్ , కెమెరా ప్యానెల్ మునుపటి కంటే చాలా మందంగా ఉండనున్నాయి. ప్రముఖ సప్లయర్ 'టాటా ఎలక్ట్రానిక్స్' (Tata Electronics) నుండి లీకైన చిత్రాలను బట్టి చూస్తే, ఐఫోన్ 18 ప్రో మొత్తం ప్రొఫైల్ దాని మునుపటి మోడల్ కంటే దాదాపు 2 మిమీ (2mm) అదనపు మందాన్ని కలిగి ఉండబోతోంది. సమాచారం కోసం చూస్తే.. ఐఫోన్ 16 ప్రో 8.25mm మందం, ఐఫోన్ 17 ప్రో 8.75mm మందంతో వచ్చాయి. ఇప్పుడు రాబోయే మోడల్ వీటన్నింటికంటే కాస్త బరువుగా, లావుగా కనిపించనుంది. ఐఫోన్ సైజు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం అందులో తీసుకురాబోతున్న కెమెరా అప్‌గ్రేడ్స్ అని తెలుస్తోంది. ఐఫోన్ 18 ప్రో లో మొదటిసారిగా మెయిన్ కెమెరా కోసం 'వేరియబుల్ అపెర్చర్' (Variable Aperture) ఫీచర్‌ను ఆపిల్ ప్రవేశపెట్టబోతోంది. దీనివల్ల కెమెరా సిస్టమ్ లోపల మెకానికల్ మార్పులు జరిగి, ఆ భాగం మరింత ముందుకు ఉబ్బినట్లుగా మారుతుంది