ఆదివాసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబే ప్రధాన కారణం
Actor ProfilePolitician

ఆదివాసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబే ప్రధాన కారణం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆదివాసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబే ప్రధాన కారణం
Andhra Jyothy20 Nov 2026
ఆదివాసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబే ప్రధాన కారణం

నేడు గిరిజనులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నాడు ఎన్టీఆర్‌, తరువాత చంద్రబాబు హయాంలోనే గిరిజనులకు మేలు జరిగిందని చెప్పారు. విజయవాడ, ఆగస్టు 09: నేడు ఆదివాసీలు గౌరవంగా జీవిస్తున్నారంటే అందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన కారణమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది గతంలో ఎవరూ చూడలేదన్నారు. సీఎం చంద్రబాబు వచ్చాకే.. ఆదివాసీ దినోత్సవం సంబరంగా జరుగుతుందని గుర్తు చేశారు. నేడు గిరిజనులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్‌, తరువాత చంద్రబాబు హయాంలోనే గిరిజనులకు మేలు జరిగిందని చెప్పారు. స్కూల్ అఫ్ ఎక్సలెన్సీ, కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా రెండు లక్షల మంది గిరిజనులు చదువుకొంటున్నారని వివరించారు. నేడు ప్రతి క్లాస్‌కి ఓ టీచర్ ఉన్నారంటే అందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కారణమని పేర్కొన్నారు. యాభై ఏళ్లకే గిరిజనులకు సీఎం చంద్రబాబు పెన్షన్ ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం 18 పధకాలను రద్దు చేసి గిరిజనులు పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎంగా చంద్రబాబు వచ్చాక ఆ 18 పధకాలను మళ్లీ అమలు చేశారని చెప్పారు. ఈ రెండేళ్లల్లో రాష్ట్రంలో రూ.2,500 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదార్లు, మౌలిక సౌకర్యాలు కల్పించారని చెప్పారు. ఫీడర్ అంబులెన్స్‌ల సృష్టికర్త చంద్రబాబు అని అన్నారు. పర్మిషన్ లేని ప్రదేశాల్లో కూడా నేడు రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే కొండలు, వాగు లు దాటే పరిస్థితి ఉండేదని.. కానీ నేడు నేరుగా తండాల నుంచి ఆసుపత్రికి వెళ్లేలా రోడ్లు వేశారని వివరించారు. చంద్రబాబు సారధ్యంలో గిరిజన గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి సంధ్యారాణి తెలిపారు. తాగునీరు కూడా లేని పరిస్థితి ఉన్న అన్ని గ్రామాలకు మంచి నీటిని సీఎం చంద్రబాబు అందించారని