
90ల కాలంలో తన కామెడీ, ఎనర్జెటిక్ డాన్సులతో బాలీవుడ్‌ను ఏలిన స్టార్ హీరో గోవిందా. ఎప్పుడూ నవ్వుతూ, పక్కన ఉన్నవారిని నవ్విస్తూ కనిపించే ఈ నటుడి జీవితంలో ఎవరికీ తెలియని ఒక మహా విషాదం ఉంది. ఒకానొక సమయంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇటీవల ఏఎన్‌ఐ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గోవిందా, తన తల్లి నిర్మలా దేవి మరణం తర్వాత తాను అనుభవించిన నరకాన్ని, ఆత్మహత్య ఆలోచనలను ఓపెన్‌గా పంచుకున్నారు. 1996 జూన్ 15న ప్రముఖ హిందూస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, నటి అయిన గోవిందా తల్లి నిర్మలా దేవి 69 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అమ్మ అంటే ప్రాణంగా భావించే గోవిందా, ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయారు. ఆ గ్యాప్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనై, నర్మదా నది లోపలికి నడుచుకుంటూ వెళ్లినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో గోవిందా మాట్లాడుతూ.. "ఆ సమయంలో నేను చెప్పలేని తీవ్రమైన మనో వేదనలో ఉన్నాను. నాకు చాలా బాధగా అనిపించింది. నా జీవితంలో అంతా అయిపోయింది, ఇక ఇదే చివరి అనిపించింది. నేను నర్మదా నది ఒడ్డున ఉన్నాను. నదిలోకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నా తల్లిని మళ్లీ కలుసుకోవచ్చని ఆలోచించాను. అందుకే నీళ్లలోకి దిగి ముందుకు వెళ్లాను" అని తెలిపారు. యాంకర్ ప్రశ్నిస్తూ.. మీరు ఆ క్షణంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అని అడగ్గా, గోవిందా స్పందిస్తూ.. "ఒక రకంగా అవుననే చెప్పాలి. నేను మా అమ్మకు చాలా దగ్గరగా ఉండేవాడిని. ఆమెను అమితంగా ప్రేమించాను. లోకం దీన్ని ఆత్మహత్య అని పిలుస్తుంది. కానీ నిజానికి మన దగ్గర అలాంటిదేమీ ఉండదు. జీవితం ఎప్పటికీ అంతం కాదు, అది కొత్త రూపాలను తీసుకుంటుంది" అని తన భావాలను వ్యక్తపరిచారు. నీటిలో ముందుకు వెళ్తున్న గోవిందాను రామ కుండల్ అనే పూజారి గమనించారు. ఆ పూజారి గోవిందాను గట్టిగా పిలిచి, నదిలో