ఆటా19వ మహాసభలు.. హాజరుకానున్న అమెరికా రాజకీయ ప్రముఖులు
Actor ProfilePolitician

ఆటా19వ మహాసభలు.. హాజరుకానున్న అమెరికా రాజకీయ ప్రముఖులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆటా19వ మహాసభలు.. హాజరుకానున్న అమెరికా రాజకీయ ప్రముఖులు
Telugu Times6 Oct 2026
ఆటా19వ మహాసభలు.. హాజరుకానున్న అమెరికా రాజకీయ ప్రముఖులు

ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ మహాసభలు, యూత్ కన్వెన్షన్, జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్, మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ , వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా హష్మీ హాజరుకానున్నారు. విశేషమేమిటంటే, ఇరువురు లెఫ్టినెంట్ గవర్నర్లు హైదరాబాద్‌లో జన్మించిన వారు కావడం, అమెరికా , తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. కార్యక్రమ వివరాలు.. ఈ మూడు రోజుల కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, వ్యాపార ప్యానెల్ చర్చలు, యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, మహిళా ఫోరమ్‌లు, సాహిత్య సమావేశాలు , ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకల్లో పాల్గొనడానికి ఆసక్తి గలవారు వెబ్‌సైట్ ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు