
ప్రముఖ గాయని ఎస్. జానకి మరణంతో మ్యూజిక్ ప్రపంచం మూగబోయింది. శనివారం మైసూర్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు జానకి. ఆమె మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జానకి తన సుదీర్ఘ గాన ప్రస్థానంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలను, ముఖ్యంగా దివంగత నటి సావిత్రితో తన అనుభవాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె తన అద్భుతమైన గాన శైలిలోని ప్రత్యేకతలను, సంగీత ప్రపంచంలో ఎదురైన సవాళ్లను వివరించారు. తన పాటలలోని స్పాంటేనియస్ గమకాలు, మాడ్యులేషన్స్ గురించి జానకి గారు మాట్లాడుతూ.. అవి ఎవరూ నేర్పినవి కావని, రికార్డింగ్ సమయంలో సహజంగానే వస్తాయని అన్నారు. అలాగే పాటలలోని భావ వ్యక్తీకరణకు మాడ్యులేషన్ ఎంత ముఖ్యమో తెలియజేశారు. ఇటువంటి అంశాలు గాయనీ గాయకుల సొంత ప్రతిభకు నిదర్శనమని, దీనివల్లే పాటకు జీవం వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది కూడా చదవండి : జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ నటి తన కెరీర్‌లో మొదటి తమిళ పాట, నీలగిరి చిత్రంలోని శృంగార వేలనేదేవే గురించి జానకి గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పాటను మొదట లతా మంగేష్కర్ గారితో పాడించాలని భావించి, బాంబేకి తీసుకెళ్లారని, అయితే వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదని తెలిపారు. సంగీత దర్శకుడు నీలయ్య గారు తనను సంప్రదించినప్పుడు, జానకి గారు ఆ పాటను కేవలం స్వరాలు పాడుకోకుండా రాగంగా పాడితే బాగుంటుందని సూచించారు. ఈ సూచనను సంగీత దర్శకుడు అంగీకరించడమే కాకుండా, చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారని జానకి గారు గుర్తుచేసుకున్నారు. డోలు, నాదస్వరం వంటి వాయిద్యాలతో కూడిన ఆ పాట ట్రాక్ ను మొదటగానే సిద్ధం చేశారని ఆమె తెలిపారు. ఈ పాట రికార్డింగ్ లో పాల్గొన్న ప్రొడ్యూసర్లు, లిరిక్ రైటర్ కుమార బాలసుబ్రహ్మణ్యం, సుబ్బయ్య నాయుడు, సావిత్రి, జెమినీ గణేశన్ వంటి ప్రముఖులందరూ నేడు లేరని