ఆ హీరోని చిన్నప్పుడు తెగ ఎత్తుకునేదాన్ని.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు
Actor ProfileActor

ఆ హీరోని చిన్నప్పుడు తెగ ఎత్తుకునేదాన్ని.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ హీరోని చిన్నప్పుడు తెగ ఎత్తుకునేదాన్ని.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు
TV9 Telugu29 Dec 2026
ఆ హీరోని చిన్నప్పుడు తెగ ఎత్తుకునేదాన్ని.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఆర్కే రోజా తన సినీ ప్రస్థానం, టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆమెకు గల అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనను చూస్తుంటే, పాత రోజుల్లో తనతో కలిసి నటించిన హీరోలు ఆశ్చర్యపోతారని తెలిపారు. వెంకటేశ్‌గారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు వంటి వారు ఎదురుపడినప్పుడు ఎలా ఉన్నావ్ రోజా.? అని ఆప్యాయంగా పలకరిస్తారని చెప్పారు. ఆమె బాలకృష్ణతో కలిసి నటించిన భైరవ ద్వీపం సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో క్వీన్ గెటప్‌లో ఆమె చాలా బాగుంటారని, తన అందానికి దేవుడు మంచి ఫీచర్స్ ఇచ్చారని బాలకృష్ణ ప్రశంసించేవారని తెలిపారు. భైరవ ద్వీపంలో తనకు స్క్రీన్ టెస్ట్ కూడా చేయలేదని పేర్కొన్నారు. అన్నమయ్య చిత్రంలో మోహన్‌బాబు పక్కన క్వీన్ క్యారెక్టర్‌కి కూడా తననే తీసుకున్నారని, ఎక్కడ క్వీన్ పాత్ర ఉన్నా తననే ఎంచుకునేవారని చెప్పారు. వెంకటేశ్‌గారి గురించి మాట్లాడుతూ.. ఆయన కొంచెం రిజర్వ్‌డ్‌గా ఉంటారని, అందరినీ పిలిచి మాట్లాడేంత జోవియల్‌గా ఉండరని తెలిపారు. బాలకృష్ణగారు మాత్రం సెట్‌లో అందరినీ కూర్చోబెట్టి కబుర్లు, పాటలు, పద్యాలు చెప్తూ సరదాగా గడిపేవారని పేర్కొన్నారు. నాగార్జునగారు చాలా కూల్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉంటారని, ఎవరినీ హర్ట్ చేయరని, హీరోయిన్లు ఆయనతో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారని ఆమె చెప్పారు. ప్రస్తుత తరం హీరోల గురించి మాట్లాడుతూ, మహేష్ బాబుకు తాను వీరాభిమానినని రోజా తెలిపారు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని, తన మేకప్ మేన్ పట్టాభి, మహేష్ బాబు హీరోగా చేసినప్పటి నుంచి ఆయనతోనే ఉన్నారని గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబుకు తల్లి పాత్ర కాకుండా వదిన లేదా అక్క పాత్ర చేయాలనుందని, ఒకవేళ తల్లి పాత్ర చేయాల్సి వచ్చినా పవర్‌ఫుల్ రోల్ అయితే చేస్తానని చెప్పారు. ప్రభాస్ వ్యక్తిత్వం తనకు బాగా ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ స్టైల్, అల్లు అర్జున్