
సినీయర్ హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పరక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జయప్రద తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి, నందమూరి బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి, తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన కొన్ని చిత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆమె మూడు తరాల నటులతో కలిసి పనిచేశానని, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి తన సమకాలీనులతో పాటు బాలకృష్ణతో కూడా నటించానని తెలిపారు. బాలకృష్ణ గురించి మాట్లాడుతూ, ఆయనపై తనకు ఎంతో ఇష్టం ఉందని జయప్రద పేర్కొన్నారు. బాలకృష్ణ మొహమాటం లేకుండా, మనస్ఫూర్తిగా మాట్లాడే వ్యక్తి అని, ఆయన గుండె చాలా మంచిదని చెప్పుకోచ్చారు. ఆయన డైలాగ్ డెలివరీ అద్భుతమని, తన కెరీర్‌లో అలాంటి డెలివరీని చూశానని అన్నారు. బాలకృష్ణతో చిన్నతనంలోనే నటించలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని, అయితే ఆ తర్వాత “మహారథి” చిత్రంలో ఆయనకు అత్త పాత్రలో నటించానని గుర్తు చేసుకున్నారు. అలాంటి పవర్‌ఫుల్ పాత్రలు మళ్లీ చేయాలని తెలిపారు. తన కెరీర్‌లో ఒక సంఘటనను జయప్రద గుర్తు చేసుకున్నారు. బాలయ్య సినిమా చిత్రీకరణ సమయంలో రాజమండ్రి నుంచి రైలులో ప్రయాణిస్తుండగా వరదలు వచ్చాయని, రైలు పట్టాలు కొట్టుకుపోయాయని తెలిపారు. రైలు ప్రమాదానికి గురయ్యే స్థితి నుంచి తృటిలో తప్పించుకుందని, మూడు రోజుల పాటు ట్రైన్‌లోనే ఆహారం లేకుండా చిక్కుకుపోయినట్లు వివరించారు. ఆ భయానక వాతావరణంలోనూ జనం “జయప్రద గారు బయటికి రావాలి” అని అరుస్తూ తనను గుర్తించడం, ఆకలితో ఏడుస్తున్న తనకు ఒక ఆఫీసర్ ఇంటి నుండి దాల్-చావల్ తీసుకువచ్చి ఇవ్వడం వంటి సంఘటనలు తన మదిలో చెరిగిపోనివిగా నిలిచిపోయాయని ఆమె పంచుకున్నారు. తన కెరీర్‌లో మరపురాని చిత్రంగా “అంతులేని కథ” గురించి జయప్రద ప్రత్యేకంగా ప్రస్తావించారు. కమర్షియల్ చిత్రాలు ఎలా ఉన్నా, ఈ సినిమా తనకెంతో పేరు తెచ్చిందని, నేటికీ ఆ చిత్రంలోని పాత్రకు ప్రాధాన్యత