
హైదరాబాద్: టెసరాట్ సంస్థకు భూ కేటాయింపుల అంశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) అన్నారు. సీఎం సోదరులకు భూ కేటాయింపులు చేశారంటూ ఆయన అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. మీడియాతో చిట్‌చాట్‌లో శ్రీధర్‌బాబు మాట్లాడారు. ‘‘బీఆర్‌ఎస్ హయాంలో ఎకరం రూ.90లక్షలకు ఇస్తే.. మేం రూ.కోటిన్నరకు ఇచ్చాం. బోర్డు డిసైడ్ చేసిన దానికంటే రూపాయి కూడా తక్కువకు ఇవ్వలేదు. 32 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఒకటి టెసరాట్ కంపెనీ. నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయి. ఆ సంస్థతో సీఎం రేవంత్ సోదరులకు సంబంధం లేదు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఆయన ఆరోపణలు చేయడం.. ఐదు ఎకరాల్లో రూ.34 కోట్లతో ఏర్పాటయ్యే కంపెనీని రూ.200 కోట్ల సంస్థగా కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. బీఆర్‌ఎస్ హయాంలో ముడుపులు తీసుకునే కంపెనీలకు భూములు ఇచ్చారా? తక్కువ ధరకు ఎందుకు ఇచ్చారో కేటీఆర్ సమాధానం చెప్పాలి. మీడియాలో వస్తుందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. పీఎం ఏక్తామాల్ టెండర్లు పారదర్శకంగా జరిగాయి. పరిశ్రమలు రావొద్దనే హిడెన్ అజెండాతో కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నా శాఖలో జరిగే ప్రతి నిర్ణయం నాకు తెలుసు. ఎవరో చెప్తే నేను పనిచేసే రకం కాదు. బీఆర్‌ఎస్ హయాంలో లీజుకు ఇచ్చిన భూములను రెగ్యులరైజ్ చేశారు. అప్పుడు కేటీఆర్‌కు తప్పనిపించలేదా?బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావడం కలలో మాట’’ అని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర