ఆ రెండు పార్టీలు రక్త కన్నీరు’ నాగభూషణాన్ని మించి జీవిస్తున్నాయి.. బండి సంజయ్ సెటైర్లు
Actor ProfilePolitician

ఆ రెండు పార్టీలు రక్త కన్నీరు’ నాగభూషణాన్ని మించి జీవిస్తున్నాయి.. బండి సంజయ్ సెటైర్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ రెండు పార్టీలు రక్త కన్నీరు’ నాగభూషణాన్ని మించి జీవిస్తున్నాయి.. బండి సంజయ్ సెటైర్లు
Andhra Jyothy3 Nov 2026
ఆ రెండు పార్టీలు రక్త కన్నీరు’ నాగభూషణాన్ని మించి జీవిస్తున్నాయి.. బండి సంజయ్ సెటైర్లు

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు. హైదరాబాద్, జులై 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు. ’కాంగ్రెస్ డైరెక్షన్.. బీఆర్ఎస్ యాక్షన్ మూవీ.. రక్త కన్నీరు-2’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు రెండు పార్టీల నేతలు రక్తకన్నీరు సినిమా చూపిస్తున్నారని విమర్శించారు. ‘రక్త కన్నీరు’ నాగభూషణాన్ని మించి నటనలో జీవిస్తున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. బీఆర్ఎస్ కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీళ్ల పాల్జేసిందని ఆరోపించారు. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ కోమాలోకి నెట్టింది.. ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరాన్ని కోమాలోకి నెట్టిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీల పాపాలకు తెలంగాణ రైతన్నలే బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతకానితనాన్ని ఎన్డీఎస్ఏపై నెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం బ్యారేజీల యజమాని తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ కమిటీలు సలహాలు మాత్రమే ఇస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. బ్యారేజీ మరమ్మతులు చేయాల్సింది కాంగ్రెస్ సర్కార్‌నే.. బ్యారేజీ మరమ్మతు పనులు చేయాల్సింది కాంగ్రెస్ సర్కార్‌నే... బాధ్యత వహించాల్సింది కూడా ఈ ప్రభుత్వానిదేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇప్పటికే మూడుసార్లు నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని పదేపదే చెప్పినా ఎందుకు పెడచెవిన పెడుతున్నారు? అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టడం సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, బాధ్యులను జైల్లో