ఆ మూల్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు'.. రణబాలి’ ప వ ర్ ఫుల్ పోస్టర్ తో విజయ్ దేవరకొండ దేశభక్తి
Actor ProfileActor

ఆ మూల్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు'.. రణబాలి’ ప వ ర్ ఫుల్ పోస్టర్ తో విజయ్ దేవరకొండ దేశభక్తి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ మూల్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు'.. రణబాలి’ ప వ ర్ ఫుల్ పోస్టర్ తో విజయ్ దేవరకొండ దేశభక్తి
AP7AM23 Dec 2026
ఆ మూల్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు'.. రణబాలి’ ప వ ర్ ఫుల్ పోస్టర్ తో విజయ్ దేవరకొండ దేశభక్తి

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను నటిస్తున్న 'రణబాలి' చిత్రం నుంచి దేశభక్తి ఉట్టిపడేలా ఉన్న ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ఎంతగా పోరాడారో గుర్తుంచుకోవాలని, స్వేచ్ఛ కోసం చెల్లించిన మూల్యాన్ని ఎప్పటికీ మరువొద్దని ఆయన పిలుపునిచ్చారు."ఇది మనందరికీ గొప్ప పండుగ రోజు. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ఎంత కష్టపడ్డారో, మనం ఎంత దూరం ప్రయాణించామో గుర్తుంచుకోవాల్సిన రోజు. స్వేచ్ఛ కోసం చెల్లించిన మూల్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ కుటుంబాలకు, దేశానికి కీర్తి ప్రతిష్ఠ‌లు తీసుకురండి. నా సోదరులకు, నా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు" అని విజయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ దేశభక్తి కలిగిన 'రణబాలి' అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న 'జయమ్మ' పాత్రలో కనిపించనుంది. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'ది మమ్మీ'లో ఇమ్‌హోటెప్‌ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో 'సర్ థియోడర్ హెక్టర్' అనే ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండటం విశేషం.ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. 19వ శతాబ్దం నేపథ్యంలో ముఖ్యంగా 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా ఈ పీరియాడిక్‌ యాక్షన్ డ్రామాను పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. చరిత్ర పుస్తకాల్లో చోటు