ఆ భయంతో నా కొడుక్కి పాలు ఇవ్వడం మానేశాను, కల్తీ ఆహారం
Actor ProfileActor

ఆ భయంతో నా కొడుక్కి పాలు ఇవ్వడం మానేశాను, కల్తీ ఆహారం

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources4
ఆ భయంతో నా కొడుక్కి పాలు ఇవ్వడం మానేశాను, కల్తీ ఆహారంపై కాజల్ షాకింగ్స్ కామెంట్స్
Asianet News Telugu25 Oct 2026
ఆ భయంతో నా కొడుక్కి పాలు ఇవ్వడం మానేశాను, కల్తీ ఆహారంపై కాజల్ షాకింగ్స్ కామెంట్స్

చాలా మంది తల్లులు పాలు తాగితే బలం వస్తుందని పిల్లలకు ఇస్తుంటారు.. కానీ తన కొడుకు విషయంలో మాత్రం అసలు పాలివ్వడమే మానేశానని హీరోయిన్ కాజల్ అన్నారు. ప్రపంచంలో జరుగుతున్న ఆహార కల్తీ నేపథ్యంలో 'ది ఇండియన్ స్టోరీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూలై 24న సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ బోల్డెన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. మన డైలీ లైఫ్‍లో మనం తీసుకునే ఆహారం ఎంతలా కల్తీ అయిపోయిందో వివరిస్తూ కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు. కథ కోసం రీసర్చ్‌ చేస్తే చాలా విషయాలు బయటపడ్డాయన్నారు. అవి చూసి షాకయ్యానని... ప్రస్తుతం ప్రతి ఇంట్లో క్యాన్సర్‌ సాధారణమైపోయిందని చెప్పుకొచ్చారు. ఇటీవల వాటర్ మిలన్ కేసు చూసి పుచ్చకాయ తినడం మానేశానన్నారు. క్యాన్సర్ నేపథ్యంతో ఈ సినిమా రూపొందించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఒక కఠిన నిర్ణయాన్ని ఆమె పంచుకున్నారు.మనం చిన్నప్పటి నుంచి పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చదువుకున్నాం... కానీ ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో దొరుకుతున్న ప్యాకెట్ పాలలో అసలు పాలల్లో ఏం కలుపుతున్నారో తెలియడం లేదని కాజల్ అన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నాక, దీని వెనుక జరిగిన రీసెర్చ్ చూశాక చాలా భయపడ్డానని అన్నారు. మనం నిత్యం వాడే ప్యాకెట్ పాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో తెలిసి షాక్ అయ్యానని తెలిపారు. ఆ భయంతోనే తన కొడుక్కి మార్కెట్లో దొరికే పాలు ఇవ్వడం పూర్తిగా మానేశానన్నారు. తనను క్రూరమైన తల్లి అని అనుకున్నా పర్లేదు కానీ...తన కొడుకు ఆరోగ్యమే ముఖ్యమని అన్నారు. కేవలం పాలు మాత్రమే కాదు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల విషయంలో కూడా తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కాజల్ తెలిపారు. ఇప్పుడున్న 5 మినిట్స్ డెలివరీ యాప్స్ వల్ల మనకు పనులు సులువు అవుతున్నాయి

కంచంలో ఉన్నది అమృతమేనా
Sakshi2 Oct 2026
కంచంలో ఉన్నది అమృతమేనా

‘మనిషి తినే ఆహారం ఔషధంలా ఉండాలి... ఔషధమే ఆహారంలా మారే పరిస్థితి రాకూడదు’ అని హిప్పోక్రటీస్‌ ఏనాడో చెప్పాడు. కానీ నేడు పరిస్థితి ఏమిటి? మనం తినేది ఆహారమో, విషమో తెలియని దుఃస్థితి. కల్తీ ఆహారం అనేది

ఆహార భద్రతపై నటి కాజల్ అగర్వాల్ తీవ్ర ఆందోళన
SkyC Media8 Sept 2026
ఆహార భద్రతపై నటి కాజల్ అగర్వాల్ తీవ్ర ఆందోళన

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దేశంలో ఉన్న ఆహార భద్రత లోపాలపై అత్యంత తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. తన తాజా చిత్రం ది ఇండియా స్టోరీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక

ప్లేట్ లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా
NTV Telugu18 Jun 2026
ప్లేట్ లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా

మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలో ఎంతటి ప్రమాదం దాగి ఉందో కళ్లకు కట్టేందుకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సిద్ధమైంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా