ఆ పాట వినగానే కన్నీళ్లు ఆగలేదు.. రైటర్ విజయేంద్ర ప్రసాద్
Actor ProfileActor

ఆ పాట వినగానే కన్నీళ్లు ఆగలేదు.. రైటర్ విజయేంద్ర ప్రసాద్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ పాట వినగానే కన్నీళ్లు ఆగలేదు.. రైటర్ విజయేంద్ర ప్రసాద్
TV9 Telugu23 Nov 2026
ఆ పాట వినగానే కన్నీళ్లు ఆగలేదు.. రైటర్ విజయేంద్ర ప్రసాద్

ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, తన కుమారుడు, స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన RRR సినిమాలోని జనని పాటతో తనకు ఎదురైన భావోద్వేగ అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన ఈ పాటను మొదటిసారి విన్నప్పుడు, తాను అదుపు చేసుకోలేనంతగా కంటతడి పెట్టుకున్నానని ఆయన పంచుకున్నారు. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత రీ-రికార్డింగ్ కోసం కీరవాణి ఈ పాటను కంపోజ్ చేశారని, రాజమౌళి గదిలోంచి వినిపించిన ఈ పాట తనను అమితంగా కదిలించిందని ఆయన తెలిపారు. “ఆ పాట విన్నప్పుడు నేను షేమ్ లెస్ గా ఏడ్చేశాను. నాకు ఎందుకు అంత భావోద్వేగం కలిగిందో తెలియదు. బహుశా అది దేశభక్తి వల్లే జరిగిందని భావిస్తున్నాను,” అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు కూడా ఇదే విధమైన భావోద్వేగాన్ని అనుభవించారని చెప్పుకొచ్చారు. RRR సినిమాలో అజయ్ దేవగన్ రామ్ చరణ్ ను ఉత్తేజపరిచే ఒక కీలకమైన కామియో పాత్రను పోషించారని అన్నారు. రచయితగా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, ఏ సినిమా రచయిత అయినా తనలో ఒక డైరెక్టర్ లేకుండా కథ రాయలేడని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. కథ రాసేటప్పుడు తాను చూసిన దృశ్యాన్ని కాగితంపై పెట్టడం తన పని అని, అయితే కంటి ముందు కనిపించిన దృశ్యాన్ని తెరకెక్కించడానికి అనేక విభాగాలతో, ముఖ్యంగా మానవ సంబంధాలతో వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. “అందరితోనూ చాలా బాగా మాట్లాడి వాళ్ళతో పని చేయించుకోవాలి. అది పెద్ద కళ. ఆ విషయంలో నేను బలహీనుడిని,” అని ఆయన ఒప్పుకున్నారు. అయితే, రాజమౌళికి ఆ కళ బాగా తెలుసని, ఎవరినీ నొప్పించకుండా తనకు కావలసిన పనిని చేయించుకోవడంలో అతను నిష్ణాతుడని ప్రశంసించారు. రాజమౌళికి కథ చెప్పే స్వేచ్ఛ తనకు ఎప్పుడూ ఉంటుందని, అయితే తన నిర్ణయాలు తాను తీసుకోవడానికి రాజమౌళికి పూర్తి హక్కు ఉందని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం