
తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేటలో మూడున్నరేళ్ల పసికందుపై జరిగిన అత్యంత దారుణమైన అత్యాచారం, హత్య కేసులో ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘోర కలికి ఒడిగట్టిన నిందితుడు పాముల నాగరాజు అలియాస్ సుశాంత్‌కు న్యాయస్థానం ఊపిరి ఉన్నంత వరకు కఠిన కారాగార శిక్ష (యావజ్జీవ శిక్ష) విధిస్తూ తీర్పునిచ్చింది.నిందితుడిపై మోపబడిన అత్యాచారం కేసులో ఒక జీవితాంతం కఠిన కారాగార శిక్ష, అలాగే హత్య కేసులోనూ మరో జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధిస్తూ.. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు తన జీవితాంతం, అంటే సహజ మరణం సంభవించే వరకు జైలు కటకటాల వెనుకే ఉండాలి అని కోర్టు తీర్పులో పేర్కొనడం గమనార్హం. దాంతో పాటు, కడుపుకోత మిగిలిన బాధిత బాలిక తల్లిదండ్రులకు రూ.10 లక్షల ఆర్థిక పరిహారం చెల్లించాలని ప్రభుత్వం, అధికారులను ఆదేశించింది.నాడు ఏం జరిగింది?..ఈ అమానుష ఘటన 2024 నవంబర్ 1వ తేదీన వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీలో చోటుచేసుకుంది. మూడున్నరేళ్ల పసికూన సన్విత అలియాస్ చెంచమ్మ ఇంటి వద్ద ఆడుకుంటుండగా, నిందితుడు నాగరాజు అలియాస్ సుశాంత్ బిస్కెట్లు కొనిస్తానని నమ్మించి పక్కకు తీసుకెళ్లాడు. చిన్నారిని గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ నరకయాతన భరించలేక పాప గట్టిగా ఏడవడంతో, ఎక్కడ తన పాపం బయటపడుతుందోననే భయంతో ఆ పసిగుడ్డు గొంతు నులిమి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. బిస్కెట్ ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. రాజుకున్న రాజకీయ రచ్చ!అనంతరం శవాన్ని అక్కడి పొదల్లో పడేసి, ఏమీ తెలియనట్లు సైలెంట్‌గా ఇంటికి వచ్చి కూర్చున్నాడు. బయటకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు పాప కనిపించకపోవడంతో కంగారుపడ్డారు. వెళ్లేముందు పాపతో పాటు సుశాంత్ ఉన్న విషయాన్ని గమనించిన వారు, పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అతనిపై అనుమానం