ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్ కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని
Actor ProfileActor

ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్ కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్ కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని
TV9 Telugu6 Nov 2026
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్ కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

పోసాని కృష్ణమురళి తన సినీ పరిశ్రమ ప్రస్థానాన్ని, వ్యక్తిగత విజయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. డాక్టరేట్ పూర్తిచేసే దశలో ఉండగా, దర్శకుడు మోహన్ గాంధీ గుర్తించి, బలవంతంగా రచయితగా మార్చారని తెలిపారు పోసాని. "చదువుకున్నావు కదా, పెళ్లి చేసుకోవాలి, జీవితంలో స్థిరపడాలి" అని ప్రోత్సహించి, తన దగ్గరే ఆఫీసులో ఉండమని, పైకి వచ్చేదాకా సహాయపడతానని మోహన్ గాంధీ హామీ ఇచ్చినట్లు పోసాని గుర్తుచేసుకున్నారు. పోలీస్ బ్రదర్స్ వంటి మొదటి సినిమా విజయం తన కెరీర్‌కు పునాది వేసిందని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. తాను రోజుకు 18 నుంచి 19 గంటలు పని చేసేవాడినని, కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవాడినని తెలిపారు. ఉదయం నాలుగు గంటలకే లేచి వాకింగ్ వెళ్లే అలవాటు ఉండేదని చెప్పారు. తన బాల్యం గురించి చెబుతూ, రూ .7 రూపాయల కోసం ముళ్ళున్న చెక్కలతో బుట్టలు అల్లిన రోజుల నుంచి వచ్చానని గుర్తుచేసుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో అసిస్టెంట్లకు డబ్బులు ఇవ్వని రోజుల్లో, పోసాని కృష్ణమురళి మాత్రం తన అసిస్టెంట్లకు నెలకు రూ.2000-రూ.3000 ఇచ్చేవారని, ఈ విషయంలో ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇది కూడా చదవండి : జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ నటి పోసాని వద్ద పనిచేసిన పలువురు అసిస్టెంట్లు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకులుగా, రచయితలుగా ఎదిగారు. ఆకుల శివ, కొరటాల శివ, సంపత్ నంది, డివిఎస్ రవి వంటి సుమారు 30 మంది పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసిన వారే అని పేర్కొన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం తన వద్ద అసిస్టెంట్‌గా చేరడానికి పట్టుబట్టిన విషయాన్ని పంచుకున్నారు. త్రివిక్రమ్, తనకు పోసాని అంటే అభిమానమని చెప్పి రెండు, మూడు నెలలు పోసాని ఇంటి చుట్టూ తిరిగారని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గౌతమ్ రాజు అనే కమెడియన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు రూ.1000 అప్పుగా