
మన మొబైల్ ఫోన్లకు వచ్చే స్పామ్, ప్రమోషనల్ కాల్స్ నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల కాలర్ ఐడీ యాప్స్ వాడుతున్న యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై కొన్ని ప్రత్యేకమైన నంబర్ల సిరీస్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను బ్లాక్ చేయడం గానీ, వాటిని ఫిల్టర్ చేయడం గానీ ఏ థర్డ్ పార్టీ యాప్ వల్ల సాధ్యం కాదని ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ మేరకు టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ కింద సరికొత్త నిబంధనలను శనివారం విడుదల చేసింది.బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ వంటి నియంత్రిత సంస్థలు (RBI, Sebi, IRDAI, PFRDA వంటి వాటి కింద రిజిస్టర్ అయినవి) తమ కస్టమర్లకు చేసే అవసరమైన సేవా సమాచారం, లావాదేవీల కాల్స్ కోసం.. అలాగే ప్రభుత్వ సంస్థలు నేరుగా పౌరులతో మాట్లాడేందుకు (Govt-to-Citizen) కేంద్రం ప్రత్యేకంగా 1600 సిరీస్ నంబర్లను కేటాయించింది. ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం కోసం కేటాయించిన ఈ 1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను బ్లాక్ చేయడానికి గానీ, ట్యాగ్ చేయడానికి గానీ ఎలాంటి అనుమతి లేదని ట్రాయ్ స్పష్టంగా ప్రకటించింది. ఆ మొబైల్ నంబర్లలో డేటా ఏమవుతుంది ? సుప్రీంలో ట్రాయ్, వాట్సాప్ క్లారిటీ..!140 సిరీస్ కాల్స్‌పై ఉన్న రూల్స్ ఇవే..టెలిమార్కెటర్లు చేసే ప్రమోషనల్ (ప్రకటనల) కాల్స్ కోసం ప్రభుత్వం 140 సిరీస్ నంబర్లను కేటాయించింది. ఈ 140 సిరీస్ నుంచి వచ్చే కాల్స్ మీకు రాకూడదనుకుంటే, కస్టమర్లు తమ మొబైల్ ద్వారా డు నాట్ డిస్టర్బ్ (DND) రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ద్వారా మాత్రమే వాటిని అడ్డుకోవచ్చని ట్రాయ్ తెలిపింది. అయితే, ఈ నంబర్లను కూడా కాలర్ ఐడీ యాప్‌లు తమ సొంతంగా ఫిల్టర్ చేయడం గానీ, కస్టమర్లు వాటిని స్పామ్ లేదా ఫ్రాడ్ అని ట్యాగ్ చేయడం గానీ కుదరదని నియమ నిబంధనలు