
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Womens Andhra Premier League 2026: ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ ప్రోత్సాహానికి విశేష కృషి చేస్తున్న ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పురుషులకు విజయవంతంగా నిర్వహించిన ఆంధ్ర క్రికెట్ సంఘం ఇప్పుడు మహిళలకు కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీ మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు.. ఈ టోర్నమెంట్ షెడ్యూల్ కూడా ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రకటించింది. భారత మహిళల మాజీ క్రికెట్ మిథాలీ రాజ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరగనుంది. ముఖ్యమైన మైలురాయి భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. 'రెండు మూడేళ్లుగా ఏసీఏతో అనుబంధం పెంచుకున్నా. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది ఏసీఏలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఏసీఏ తీసుకున్న ఈ నిర్ణయం ఒక ప్రొఫెషనల్ సెటప్ లాంటిది. రాబోయే కాలంలో ఏసీఏ విమెన్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా' అని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారని.. వారికి అవకాశం.. ప్రోత్సాహం కావాలని పేర్కొన్నారు. మహిళల క్రికెట్‌కు గుర్తింపు 'ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ఒక ప్రొఫెషనల్ స్ట్రక్చర్‌ను ఏసీఏ క్రియేట్ చేస్తోంది. దీనివలన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఏర్పడుతుంది. విభిన్న కేటగిరీల ప్లేయర్లు ఈ టీమ్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఉన్న ఫ్రాంచైజీలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రతిభ కలిగిన క్రికెటర్లను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తోంది. మహిళల క్రికెట్‌కు బిడ్డింగ్ పెట్టడం ద్వారా దాని విలువ పెరుగుతుంది' అని సీనియర్