
Asianet News Telugu•17 Oct 2026
ఆ డైరెక్టర్ ని కలవాలంటే రూ.లక్ష కట్టాలి.. మోసపోయిన యాంకర్, ఏం చేసిందో తెలుసా"తిరిగి ఊరికి వచ్చి సీరియళ్లపై దృష్టి పెట్టాను. చిన్న చిన్న పాత్రల్లో నటించాను. స్టేజ్ షోలకు యాంకరింగ్ చేశాను. నా అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. దానికి పదిహేనేళ్లు పట్టింది. చివరికి అది జరిగింది. ఈ రోజు ఏ.ఆర్. మురుగదాస్ లాంటి వ్యక్తి నా నటనను ప్రశంసిస్తుంటే, ఆ సర్కిల్ పూర్తయినట్టు అనిపించింది. ఆ రోజు మొదటిసారి నాకు నేను థ్యాంక్స్ చెప్పుకున్నా, ఓడిపోయి వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు వెళ్లినందుకు. దేవుడి దయవల్ల డబ్బు మాత్రమే పోయింది, ఇంకేమీ పోలేదు," అని స్వాసిక ఎమోషనల్‌గా ముగించారు