
గాయని ఎస్ జానకి.. కానీ సినీ ప్రియులు, అభిమానులు, సెలబ్రెటీలు ఆమె జానకమ్మ అని గౌరవంగా పిల్చుకుంటారు. దాదాపు ఆరు దశాబ్దాలపాటు 17 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి కోట్లాది మంది హృదయాలను అలరించారు. శాస్త్రీయ సంగీతంలోని రాగాల ఔన్నత్యాన్ని ఆవిష్కరించారు ఎస్ జానకి. జానపదంలోని పల్లె పరిమళాన్నివెదజల్లింది. తల్లిగా లాలిపాట పాడింది. భక్తి గీతంలోని భక్తిని తెలిపింది. ఇప్పుడు ఆమె స్వరం ముగబోయింది. తన పాటలతో ఎంతో మందిని లాలించిన జానకమ్మ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె..శనివారం సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. జానకమ్మ అంత్యక్రియలు ఆదివారం (జూలై 12న) సాయంత్రం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1950వ దశకంలో ఆమె సినీ పాటల ప్రయాణం మొదలైంది. జానకమ్మ సినీ ప్రయాణంలో దాదాపు 50 వేలకు పైగ పాటలు పాడారు. అన్నీ అద్భుతమైన పాటలే. అందులో ఇప్పటి తరాన్ని సైతం ఆకట్టుకునే పాట ఇది. ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా.. సింగర్ జానకమ్మ పాడిన అద్భుతమైన పాటలలో "మౌనమేలనోయి ఈ మరపురాని రేయి" పాట ఒకటి. 1983లో విడుదలైన సాగరసంగమం సినిమాలోనిది. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో, కమల్ హాసన్, జయప్రద జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీత బ్రహ్మ ఇళయరాజా స్వరాలు సమకూర్చగా, గానకోకిల జానకమ్మ తన అమృత గాత్రంతో ప్రాణం పోశారు. ఈ పాట కేవలం ఒక ప్రేమ గీతం మాత్రమే కాదు, రెండు హృదయాల మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ. జానకమ్మ స్వరం ఈ పాటలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఈ పాట మళ్లి మళ్లి వినాలపించే విధంగా ఎంతో అద్భుతంగా ఆలపించారు జానకమ్మ. మఖ్యంగా పాటలో వ్యక్తమయ్యే భావోద్వేగాలను ఆమె పాడిన తీరు