ఆ 8 గంటలే కొంప ముంచాయి
Actor ProfilePolitician

ఆ 8 గంటలే కొంప ముంచాయి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ 8 గంటలే కొంప ముంచాయి
Sakshi7 Oct 2026
ఆ 8 గంటలే కొంప ముంచాయి

మత్స్యకారుడు చిన్నాను హెలికాప్టర్‌లోకి లాగుతున్న నేవీ సిబ్బంది చంద్రబాబు సర్కారు తీరుపై మత్స్యకారుల ఆగ్రహం వెంటనే రెస్క్యూ చేసి ఉంటే ఆరుగురూ దొరికేవాళ్లు బోటు ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నాదీ అదే మాట బోటు గల్లంతైనట్లు 4వ తేదీ రాత్రి 11.30గంటలకు సమాచారం ఈ విషయాన్ని వెల్లడించిన విశాఖ రేంజ్‌ ఐజీ గోపినాథ్‌ జెట్టి రెవెన్యూ విభాగానికి రాత్రి 8.30 గంటలకే ప్రమాద సమాచారం అయినా పట్టించుకోకుండా మిన్నకుండిపోయిన ప్రభుత్వం ప్రభుత్వ నిర్లక్ష్యమే కొంపముంచిందని మత్స్యకారుల ఆగ్రహం ఈ నెల 4వ తేదీ రాత్రి 11.30 గంటలకు ప్రమాదంపై సమాచారం అందింది. వెంటనే మరుసటి రోజు ఉదయం నుంచి గాలింపు చర్యలు ప్రారంభించాం. – మీడియా సమావేశంలో మెరైన్‌ ఐజీ గోపినాథ్‌ జెట్టి మాకు 5వ తేదీ ఉదయం సమాచారం వచ్చింది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. – మత్స్యశాఖ కమిషనర్‌ రామ్‌శంకర్‌ నాయక్‌ ఈ నెల 4న శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు బోటు బోల్తా పడింది. 12 గంటల పాటు సముద్రంలో ఈది.. ఈది.. అలసిపోయాం. తెల్లారే వరకూ ఊపిరి బిగపట్టుకొని ఉన్నాం. రావాల్సిన బోటు ఎందుకు రాలేదనే అనుమానంతో గాలించేందుకు వస్తారు.. అప్పటి వరకు బతికే ఉండాలని అందరం అనుకున్నాం. కానీ.. ఎవరూ రాలేదు. దూరంగా కనిపించిన చైనా షిప్‌ వద్దకు నేను చేరుకునే సరికి ఆదివారం ఉదయం 9 గంటలైంది. కనీసం ఉదయం 6–7 గంటలకు మా దగ్గరికి ఎవరైనా వచ్చి ఉంటే నలుగురైదుగురం బతికేవాళ్లం. – బోటు ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన కారి చిన్నా సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట: సముద్రపు అలల కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే మత్స్యకారుల పాలిట అత్యంత ప్రమాదకరంగా మారిందని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆపదలో ఉన్నామని, తమ వారి జాడ దొరకడం లేదని రాత్రి గొంతు చించుకుని మొత్తుకున్నా.. అధికార యంత్రాంగం సత్వరమే స్పందించక పోవడం వల్లే