అసలు యూపీఐ లావాదేవీలు ఉచితమా.. ఛార్జీలు పడతాయా? ఆర్థిక మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన
Actor ProfilePolitician

అసలు యూపీఐ లావాదేవీలు ఉచితమా.. ఛార్జీలు పడతాయా? ఆర్థిక మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అసలు యూపీఐ లావాదేవీలు ఉచితమా.. ఛార్జీలు పడతాయా? ఆర్థిక మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన
Samayam Telugu2 Dec 2026
అసలు యూపీఐ లావాదేవీలు ఉచితమా.. ఛార్జీలు పడతాయా? ఆర్థిక మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన

UPI MDR Charges : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులకు ఎలాంటి లావాదేవీ ఛార్జీలు ఉండవని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను (MDR) ప్రవేశపెట్టినా అది కేవలం వినియోగదారులకే కాకుండా కొన్ని ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. దీంతో యూపీఐ ఛార్జీలు వస్తాయన్న ఆందోళనలకు కేంద్రం స్పష్టత ఇచ్చినట్లయింది.యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి కూడా వినియోగదారులకు ఉచితంగానే డిజిటల్ చెల్లింపులు అందుబాటులో ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక ముందు కూడా ప్రతి భారతీయుడు ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించకుండానే యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని రాజ్యసభలో స్పష్టం చేశారు. యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం పన్ను లేదా నేరుగా వినియోగదారుల నుంచి ఛార్జీ వసూలు చేసే విధానాన్ని ఈ బిల్లు ప్రతిపాదించడం లేదని ఆమె వివరించారు. ముఖ్యంగా చిన్న దుకాణాలు, రోడ్డు పక్కన వ్యాపారులు, చిన్న వ్యాపార సంస్థల దగ్గర జరిగే తక్కువ విలువైన చెల్లింపులు ఎక్కువగా ఉచితంగానే కొనసాగుతాయని తెలిపారు.అసలు ఎండీఆర్ అంటే ఏంటి?మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (MDR) అనేది వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల్ని స్వీకరించేందుకు చెల్లించే రుసుము. సాధారణంగా ఈ మొత్తాన్ని పేమెంట్ సిస్టమ్‌లోని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు వంటి సంస్థల మధ్య పంచుకుంటారు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల విషయంలో జీరో ఎండీఆర్ విధానం అమల్లో ఉంది. అంటే వ్యాపారి యూపీఐ ద్వారా కస్టమర్ నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఆ లావాదేవీపై ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధానం వల్ల డిజిటల్ చెల్లింపులు దేశంలో భారీగా పెరిగాయి.Read Also: జులైలో అత్యధికంగా అమ్ముడుబోయిన కార్లు ఇవే.. వార్నీ మారుతీ నుంచే 6 మోడల్స్ ఉన్నాయిగా!ఇక యూపీఐ వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ దాని నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, సాంకేతిక మౌలిక వసతులు వంటి వాటికి భారీగా