Multibaggers in Stock Market: అద్భుతం ఎక్కడో జరగదు. మన చుట్టూనే కనిపిస్తుంటాయి. ఇక్కడ లక్ కూడా కలిసిరావాలి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ఈ అదృష్టం, అద్భుతం గురించి మాట్లాడుతుంటారు. అవును స్టాక్ మార్కెట్లలో కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్ల దశనే మారుస్తుంటాయి. కొన్ని స్టాక్స్ భారీగా పడిపోతున్నా ఇంకొన్ని స్టాక్స్ ఊహించని రీతిలో కళ్లుచెదిరే రిటర్న్స్ అందించేవి ఉంటాయి. ఇక్కడ సరైన స్టాక్‌ను ఎంచుకొని ఓపికతో ఎదురుచూస్తే అద్భుతం దానంతట అదే జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. చాలా వరకు స్టాక్ మార్కెట్లలో స్వల్ప కాలంలో కంటే దీర్ఘకాలంలో కచ్చితమైన రాబడి వస్తుందని సూచిస్తుంటారు. అన్ని వేళలా ఇలా జరుగుతుందని లేదు కానీ ఆయా కంపెనీల భవిష్యత్తు ప్రణాళికలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, ఒప్పందాలు ఇలా అన్నీ గమనిస్తూ సరైన స్టాక్ ఎంచుకోవడం ముఖ్యం. ఇలాంటి ఒక స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.అదే నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఇది ఫ్లోరిన్ కెమిస్ట్రీ రంగంలో అత్యంత ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రధానంగా ఏసీలు, రిఫ్రిజరేటర్లలో వాడే గ్యాస్‌లను తయారు చేస్తుంది. ఫార్మా, ఆగ్రో కెమికల్స్ రంగాల్లో వాడే ప్రత్యేక రసాయనాల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా పలు కార్యకలాపాల్ని నిర్వహిస్తుంటుంది. 2026లో ఇది డీఆర్‌డీఓతో ఒక కీలక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇలా విజయవంతంగా దూసుకెళ్తున్న కంపెనీ స్టాక్ మార్కెట్లోనూ అద్భుతంగా రాణిస్తోంది. ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తోంది.ఓపికతో పదేళ్లకుపైగా ఎదురుచూసిన వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అద్భుత స్థాయిలో లాభాల్ని అందించింది. కేవలం రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారిని కూడా కోటీశ్వరులుగా చేయడం విశేషం. ఈ కెమికల్ సెక్టార్ స్టాక్ ప్రైస్ 2013 ఆగస్టు 8న సమయంలో కేవలం రూ. 33.99 వద్ద ఉంది. ఇప్పుడు చూస్తే 2026 ఆగస్ట్ 12 సెషన్‌లో సరిగ్గా రూ. 8200 స్థాయిలో ఉంది. ఈ క్రమంలో ఒక్కో షేరుపైనే
Actor ProfilePolitician
అస్సలు ఊహించి ఉండరు.. రూ. 34 నుంచి 8 వేలకు పెరిగిన షేర్ ధర.. ఓపికతో కోటీశ్వరులయ్యారు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•7 Dec 2026
అస్సలు ఊహించి ఉండరు.. రూ. 34 నుంచి 8 వేలకు పెరిగిన షేర్ ధర.. ఓపికతో కోటీశ్వరులయ్యారు