
బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలకు తనదైన స్టైల్‌ను తీసుకొచ్చిన నటుడు ఇమ్రాన్ హష్మీ. ఇటీవల ‘అవారాపన్ 2’ చిత్రంతో అలరించారు. తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నారు. బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలకు తనదైన స్టైల్‌ను తీసుకొచ్చిన నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi). ఇటీవల ‘అవారాపన్ 2’ చిత్రంతో అలరించారు. తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నారు. ఆయన నటిస్తున్న చిత్రం ‘గన్‌మాస్టర్ G9’ (Gunmaaster G9) ఆదిత్య దత్ దర్శకత్వం వ్తె వహిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చింది. సినిమా విడుదల తేదీని మేకర్స్ లాక్ చేశారు. ఈ ఏడాది నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇమ్రాన్ హష్మీ, దర్శకుడు ఆదిత్య దత్, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ముగ్గురి కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడం ‘గన్‌మాస్టర్ G9’ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. గతంలో వీరి కాంబినేషన్‌కు మంచి గుర్తింపు రావడంతో.. ఈసారి ఎలాంటి కథ, యాక్షన్ ట్రీట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తారనే ఆసక్తి నెలకొంది. హిమేష్ రేషమ్మియా సంగీతం అందిస్తుండటంతో యాక్షన్‌తో పాటు మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో హిమేష్ రేషమ్మియా గతంలో ‘సనం తేరి కసం’, ‘జీనియస్’ వంటి చిత్రాలకు పనిచేశారు. దీంతో ‘గన్‌మాస్టర్ G9’లో కూడా సంగీతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇమ్రాన్ హష్మీతో పాటు జెనీలియా దేశ్‌ముఖ్, అపర్శక్తి ఖురానా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇమ్రాన్ హష్మీ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించలేదు. సినిమా టైటిల్, జానర్‌ను బట్టి చూస్తే ఇందులో యాక్షన్, క్రైమ్ అంశాలకు ప్రాధాన్యత ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇమ్రాన్