దక్షిణాది చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు తన విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత ‘షావుకారు’ జానకి (95) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వయోభారం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమెను వారం రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బుధవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్యులు వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.* ‘నీ ధైర్యానికి హ్యాట్సాఫ్’.. అనుపమ పరమేశ్వరన్‌కి మద్దతుగా నిలిచిన ‘భైరవం’ బ్యూటీషావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. ఆమె 1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరోం జన్మించారు. చిన్నతనంలోనే రేడియో నాటికల ద్వారా కళారంగంలోకి అడుగుపెట్టిన ఆమె, అద్భుతమైన వాక్చాతుర్యం, స్పష్టమైన ఉచ్చారణతో గుర్తింపు పొందారు. అనంతరం 1950లో నందమూరి తారక రామారావు సరసన ‘షావుకారు’ చిత్రంలో వెండితెరకు పరిచయమయ్యారు. మొదటి చిత్రమే ఘనవిజయం సాధించడంతో అదే ఆమె ఇంటి పేరుగా మారి ‘షావుకారు జానకి’గా సినీ చరిత్రలో సుస్థిరమైపోయింది. ఆమె సోదరి కృష్ణకుమారి కూడా తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయికగా రాణించిన సంగతి తెలిసిందే.నాలుగు తరాల నటులతో 400 చిత్రాలుతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఆమె సొంతం. ఇందులో సుమారు 200 చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ వంటి దిగ్గజ హీరోలందరి సరసన నటించి ఆనాటి మేటి తారగా వెలుగొందారు. బహుభాషా ప్రావీణ్యం ఉన్న ఆమె, పరభాషా చిత్రాల్లోనూ తన పాత్రలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కథానాయికగానే కాకుండా, తర్వాతి కాలంలో ఎన్నో కీలకమైన సహాయ, క్యారెక్టర్ పాత్రల్లో నటించి నాలుగు తరాల నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఏవీఎం సంస్థ
Actor ProfileActor
అలనాటి నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స అందిస్తోన్న వైద్యులు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•20 Jan 2027
అలనాటి నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స అందిస్తోన్న వైద్యులు