అలనాటి అగ్రతారల నుంచి నేటి యంగ్ హీరోల వరకు.. తరాలు మారిన తిరుగులేని నటీమణి
Actor ProfileActor

అలనాటి అగ్రతారల నుంచి నేటి యంగ్ హీరోల వరకు.. తరాలు మారిన తిరుగులేని నటీమణి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అలనాటి అగ్రతారల నుంచి నేటి యంగ్ హీరోల వరకు.. తరాలు మారిన తిరుగులేని నటీమణి
TV9 Telugu25 Jan 2027
అలనాటి అగ్రతారల నుంచి నేటి యంగ్ హీరోల వరకు.. తరాలు మారిన తిరుగులేని నటీమణి

దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటీమణుల్లో రాధికా శరత్ కుమార్ ఒకరు. నటిగా ఇప్పటికీ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు రాధికా శరత్ కుమార్. 1962 ఆగస్టు 21న చెన్నైలో ప్రముఖ నటుడు ఎం.ఆర్. రాధ, గీతా దంపతులకు రాధికా జన్మించారు. రాధికకు నిరోష అనే చెల్లెలుతో పాటు పలువురు సవతి సోదరులు, సోదరీమణులు ఉన్నారు. రాధికా సినీ ప్రయాణం చాలా చిత్రంగా మొదలైంది. లండన్‌లో చదువుతున్నప్పుడు మొదటి సంవత్సరం సెలవులకి చెన్నై వచ్చిన రాధికను దర్శకుడు భారతీరాజా చూశారట. ఆ సమయంలో ఆయన కిళక్కు పోగుం రైల్ అనే సినిమా కోసం కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నారు. రాధికకు నటన పట్ల ఆసక్తి లేకపోయినా, ఆమె తండ్రి ఎం.ఆర్. రాధ అనారోగ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆమె తల్లి సినిమాకు అంగీకరించక తప్పలేదు. రాధిక తనకు యాక్టింగ్ రాదని, హీరోయిన్‌గా తాను సరిపోనని భావించినా, భారతీరాజా ఆమెను ఒప్పించి సినిమాలోకి తీసుకున్నారు. శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు 1978లో విడుదలైన కిళక్కు పోగుం రైల్ షూటింగ్ సమయంలో రాధికకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేయడంపై సెట్‌లో చాలామంది ఎగతాళి చేశారట. ఒక డాన్స్ సన్నివేశంలో కొరియోగ్రాఫర్ ఆమెను కొట్టడంతో, అవమానభారంతో షూటింగ్ వదిలి వెళ్ళిపోవాలనుకున్నారట. అయితే, నిర్మాత జోక్యం చేసుకుని ఆమెను బుజ్జగించారట. ఈ సవాళ్ళ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అఖండ విజయం సాధించింది, 365 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఈ సినిమా విజయం రాధికలోని నటిని బయటకు తీసుకొచ్చింది. ఇదే చిత్రాన్ని బాపు తెలుగులో తూర్పు వెళ్ళే రైలు పేరుతో రీమేక్ చేశారు. తర్వాత రాధికకు అవకాశాలు వెల్లువెత్తాయి. 1979లో ఆమె నటించిన ఐదు సినిమాలు విడుదలయ్యాయి. తెలుగులో ఆమె