అల్లు అర్జున్ రాకా’.. తాత
Actor ProfileActor

అల్లు అర్జున్ రాకా’.. తాత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అల్లు అర్జున్ రాకా’.. తాత, తండ్రీకొడుకులుగా 4 పవర్ ఫుల్ పాత్రల్లో బన్నీ
Samayam Telugu2 Nov 2026
అల్లు అర్జున్ రాకా’.. తాత, తండ్రీకొడుకులుగా 4 పవర్ ఫుల్ పాత్రల్లో బన్నీ

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రాకా’. ఇదొక సోసియో ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్ లో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టైటిల్ పోస్టర్ కు అనూహ్య స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘రాకా’ మూవీలో అల్లు అర్జున్ రోల్ గురించి ఇప్పటికే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఫస్ట్ లుక్ లో బన్నీ బీస్ట్ లుక్ లో కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. అయితే దీంతో పాటుగా ఆయన మరో మూడు పాత్రలు పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా అల్లు అర్జున్ కనిపించనున్నారని.. మొత్తం నాలుగు వేర్వేరు క్యారెక్టర్స్ తో అలరించడానికి రెడీ అవుతున్నారని సమాచారం.అట్లీ గతంలో 'అదిరింది' సినిమాలో విజయ్ ను తండ్రీ కొడుకులుగా మూడు పాత్రల్లో చూపించారు. 'విజయ్' మూవీలోనూ దళపతితో ద్విపాత్రాభినయం చేయించారు. 'జవాన్' సినిమాలో షారుక్ ఖాన్ కూడా తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు 'రాకా' మూవీలోనూ అట్లీ డబుల్ రోల్ ప్లాన్ చేశారట. తండ్రి, తాత పాత్రలకు వేరే యాక్టర్స్ ను తీసుకోవాలని భావించారట. కానీ అల్లు అర్జున్ నాలుగు పాత్రలను తానే చేస్తానని చెప్పారట. మొదట్లో అట్లీ కాస్త డైలమాలో పడ్డా, లుక్ టెస్ట్ తర్వాత బన్నీ చూపించిన వేరియేషన్స్ చూసి ఇదే సినిమాకు ప్లస్ అవుతుందని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. అల్లు అర్జున్ తన కెరీర్ లో ఇప్పటి వరకూ ద్విపాత్రాభినయం చేయలేదు. ఒకవేళ ఇప్పుడు 'రాకా'లో 4 పాత్రల్లో నటించేది నిజమైతే.. ఇది ఆయన సినీ కెరీర్‌లోనే ఫస్ట్ మల్టిపుల్ రోల్ మూవీగా నిలుస్తుంది. ఇక ఈ సినిమాలో