
ఇంటర్నెట్ డెస్క్: అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాకా’ (Raaka). భారీ ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని ప్రీతి ముకుందన్ వదులుకున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై అట్లీ స్పందించారు. ‘హృదయం మురళి’ సినిమా ట్రైలర్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘నేను ప్రీతి (Preity Mukhundhan) నటనకు పెద్ద అభిమానిని. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాకా’లో ఒక కీలక పాత్ర కోసం మొదట ఆమెనే సంప్రదించాను. అప్పటికే ఆమె బిజీగా ఉండటంతో మాకు డేట్స్ కేటాయించలేకపోయింది. దీంతో ఈ ప్రాజెక్టును ఆమె వదులుకోవాల్సి వచ్చింది’’ అని చెప్పారు. ప్రీతి రిజెక్ట్ చేసిన ఈ కీలక పాత్రను మలయాళ నటి ఫెమినా జార్జ్‌కు ఆఫర్ చేసినట్లు అట్లీ స్పష్టం చేశారు. ఆ పాత్రకు సంబంధించిన వివరాలను మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. ‘కన్నప్ప’తో ఇండస్ట్రీకి పరిచయమైన ప్రీతి ముకుందన్ ఇటీవల ‘బ్లాస్ట్’తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు తమిళ రొమాంటిక్ కామెడీ ‘హృదయం మురళి’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు. జులై 10న విడుదల కానుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు