
నటి ప్రేమ తన సినీ ప్రయాణం, కెరీర్ ఆప్షన్స్, అరుంధతి చిత్రం గురించిన ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ హిట్ అరుంధతి చిత్రంలోని జేజమ్మ పాత్ర కోసం మొదట తనను సంప్రదించినట్లు వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. నిజమేనని, అరుంధతిలోని జేజమ్మ క్యారెక్టర్ కోసం దర్శకుడు కోడి రామకృష్ణ తనను అడిగారని ప్రేమ ధృవీకరించారు. అయితే, ఆ సమయంలో తాను కన్నడలో ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నానని, ఒకేసారి బల్క్ డేట్స్ ఇవ్వలేకపోవడం వల్ల ఆ పాత్రను చేయలేకపోయానని తెలిపారు. తన తరువాత అనుష్క శెట్టిని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారని ఆమె వివరించారు. అనుష్క కూడా బెంగళూరుకు చెందిన అమ్మాయేనని ఆమె గుర్తు చేసుకున్నారు. అరుంధతి చిత్రం విడుదలైన తర్వాత అఖండ విజయం సాధించినప్పటికీ, ఆ పాత్రను చేయలేకపోయినందుకు తాను ఎన్నడూ బాధపడలేదని ప్రేమ స్పష్టం చేశారు. తనకు వచ్చిన ఏ పాత్రకైనా తాను పూర్తి న్యాయం చేస్తానని ఆమె అన్నారు. ఏ సినిమాకైనా ఒక అదృష్టం ఉంటుందని, అరుంధతి అదృష్టం అనుష్కకు కలిసి వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. తాను కన్నడలో "నమ్మ ఊర మందార హోవే" వంటి అనేక బిగ్గెస్ట్ హిట్ చిత్రాలు, తెలుగులో కూడా మంచి సినిమాలు చేశానని, కాబట్టి తనకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని ఆమె అన్నారు. అనుష్క శెట్టిని తాను ఎప్పుడూ కలవలేదని, అయితే ఆమెకు అలాంటి మంచి సినిమా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ప్రేమా పేర్కొన్నారు. నటి శ్రీదేవి "క్షణ క్షణం", "జగదేక వీరుడు అతిలోకసుందరి" వంటి చిత్రాల్లోని పాత్రలు తనకు చాలా ఇష్టమని, అలాంటి క్యారెక్టర్లు తనకు రాలేదని అప్పుడప్పుడు అనిపిస్తుందని ప్రేమ తెలిపారు. అయితే, తాను కూడా ఎంతో మంది పెద్ద నటులతో మంచి చిత్రాలు చేశానని గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్రతారలతో పెద్ద