యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద తన అసలైన సత్తా చాటారు. ఆయన హీరోగా, టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ థియేటర్ల వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. శుక్రవారం (జూలై 10) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రేజీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండటంతో, మొదటి రోజు అఖిల్ కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా మైండ్ బ్లోయింగ్ వసూళ్లు నమోదయ్యాయి.* పవన్ కళ్యాణ్‌కు సర్జరీ సక్సెస్.. ముంబయిలో మూడున్నర గంటల పాటు ఆపరేషన్మొదటి రోజు హిస్టారికల్ కలెక్షన్స్సినిమాకు వస్తున్న భారీ రెస్పాన్స్‌ను ప్రతిబింబిస్తూ.. చిత్ర నిర్మాణ సంస్థ ‘లెనిన్’ మొదటి రోజు వరల్డ్‌వైడ్ కలెక్షన్ల అఫీషియల్ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘లెనిన్’ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 16.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అఖిల్ కెరీర్‌లో ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఒక సాలిడ్ కమర్షియల్ సక్సెస్ పడలేదనే వెలితిని ఈ ఒక్క సినిమా తుడిచేసింది. వీకెండ్ కావడం, దీనికి తోడు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, ఇంటర్వెల్ ట్విస్టులు తోడవడంతో శని, ఆదివారాల్లో ఈ కలెక్షన్ల వర్షం మరింత గట్టిగా కురిసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.* నా కో స్టార్ట్స్‌లో అతనొక్కడే సింగిల్.. సిగ్గుపడుతూ మనసులో మాట చెప్పిన భాగ్యశ్రీ అఖిల్ సరికొత్త హిస్టరీఅఖిల్ కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన ఓపెనింగ్స్ అన్నింటినీ ‘లెనిన్’ సినిమా చాలా సునాయాసంగా దాటేసింది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన అఖిల్ చిత్రాల చార్ట్ చూస్తే ‘లెనిన్’ టాప్‌లో నిలిచింది. లెనిన్ (2026): రూ. 16.70 కోట్లు అఖిల్ - ది పవర్ ఆఫ్ జువా (2015)
Actor ProfileActor
అయ్యగారి బాక్సాఫీస్ సునామీ.. పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ లెనిన్’ రికార్డ్ ఓపెనింగ్స్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•26 Oct 2026
అయ్యగారి బాక్సాఫీస్ సునామీ.. పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ లెనిన్’ రికార్డ్ ఓపెనింగ్స్