అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియామకం! ఆయన ఎవరంటే
Actor ProfilePolitician

అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియామకం! ఆయన ఎవరంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియామకం! ఆయన ఎవరంటే
Zee Telugu1 Oct 2026
అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియామకం! ఆయన ఎవరంటే

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Who is krishna Mohan: రామ మందిరం ట్రస్టు తన విరాళాలు, ఖర్చుల పూర్తి వివరాలను తొలిసారిగా వెల్లడించింది. నిర్మాణానికి ఇప్పటివరకు మొత్తం రూ.3264 కోట్లు అందినట్లు ట్రస్ట్ తెలిపింది, ఇందులో రూ. 2,370 కోట్లు ఆలయ నిర్మాణ పనుల కోసం ఖర్చు చేసినట్లు పేర్కొంది. అయితే, నిధుల దుర్వినియోగం కేసు నేపథ్యంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు రాజీనామా చేయగా, వారి స్థానంలో కృష్ణమోహన్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నిన్న నియమితులయ్యారు. ఆయన రామ మందిరం పనులను పర్యవేక్షిస్తారు. కృష్ణమోహన్ ఎవరు? కొత్తగా తాత్కాలిక కార్యదర్శిగా నియమితులైన కృష్ణమోహన్ మాజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధికారి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) లో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం 73 ఏళ్ల కృష్ణమోహన్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన హర్దోయ్‌ జిల్లాలోని చంద్రాపూర్ గ్రామానికి చెందినవారు. అంతేకాకుండా, రామ మందిరం ట్రస్ట్ నిర్వహణలో ఉన్న లోపాలను , నిధుల్లో జరుగుతున్న అక్రమాలను మొదటగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా ఈయనే. ఆయన ఇప్పుడు తాత్కాలిక కార్యదర్శిగా నియమితులవ్వడం విశేషం. పోలీసులు, సిట్‌ రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో, భారీ ఎత్తున జరుగుతున్న విరాళాల దొంగతనం బయటపడింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ట్రస్ట్ నిర్వహణలో ఉన్న లోపాలను కొందరు స్వార్థపరులు అనుకూలంగా వాడుకున్నారని, భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చూడటమే తన బాధ్యత అని పేర్కొన్నారు. రామ మందిరానికి అందే ప్రతి రూపాయి వివరాలను పారదర్శకంగా తెలియజేస్తూ, ట్రస్ట్ పై ప్రజల నమ్మకాన్ని పెంపొందించడమే తన లక్ష్యమని