అమలాపురం ప్రెస్ క్లబ్ లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
Actor ProfilePolitician

అమలాపురం ప్రెస్ క్లబ్ లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమలాపురం ప్రెస్ క్లబ్ లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
HMTV24 Dec 2026
అమలాపురం ప్రెస్ క్లబ్ లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Amalapuram: అమలాపురం ప్రెస్ క్లబ్‌లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే అమలాపురం:అమలాపురం ప్రెస్ క్లబ్‌లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆనందరావు. భారత దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సంగ్రామంలో పత్రికారంగం, ద్రశ్య-శ్రావ్య మాధ్యమాలు మరియు విలేకరులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని కొనియాడారు. స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు సమాజంలో చైతన్యం నింపడంలో,దేశాభివృద్ధిలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల కృషి అభినందనీయమని ఆయన తెలిపారు.ప్రజా సమస్యలను నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ,దేశ పురోగతిలో విలేకరులు తమవంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు స్వయంగా ముందడుగు వేసి ఈ వేడుకను ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే ఆనందరావు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం విలేకరులకు, అమలాపురం నియోజకవర్గ ప్రజలకు ఆయన 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు,వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు